తన కన్నా ఎక్కువగాఏడుస్తున్న లక్ష్మిని చూచిన శరభయ్యకు మనసు కరిగి" నీవు నగలు చేయించమని చెప్పినా పిసినారి తనంతో నీ కోరిక తీర్చనేలేదు .ఏడవకు "అనిఊరడించాడు. అప్పుడు ఆమె " నేను మీ సొమ్ము పోయినందుకు ఏడవడం లేదండీ!. మీ సొమ్ము తో పాటు నా చెవి దుద్దులు కూడా పోయినాయి. అందుకే బాధగా ఉంది "అని అంది.అప్పుడు శరభయ్య " అవునూ! నాకు తెలియకుండా నీ దగ్గర చెవి బంగారు దుద్దులు ఎక్కడివి?" అని ప్రశ్నించాడు? " నాకు లాటరీలో వచ్చిన డబ్బుతో అవి చేయించుకున్నాను" అని లక్ష్మి బదులు ఇచ్చింది. "నా సొమ్ము దొరికితే నీకు అవి చేయిస్తాలే! ఊరుకో!" అని అన్నాడు శరభయ్య. మీ సొమ్ముతో చేయించే దుద్దులు నాకు అవసరం లేదండి. నన్ను ఇన్ని రోజులు అందరూ నాదుద్దులు చూచి ' అదృష్ట లక్ష్మీ' అని పిలిచేవారు. ఇప్పుడు మీరు చేయించే బంగారు దుద్దులు పెట్టుకుంటే "పిసినారి లక్ష్మి" అని పిలుస్తారు .ఆ గొప్ప బిరుదు నాకు అవసరం లేదు" అని ఎగతాళిగా అంది లక్ష్మి.అది విని అసలే సొమ్ము పోయిన దుఃఖంలో ఉన్న శరభయ్యకు నోట మాట రాలేదు. అందుకే పిసినారితనం తో సొమ్మును దాచి పెడితే అది మనకు దక్కదు. ఒకవేళ దక్కినా దానిని ఎవ్వరూ ఇష్టపడరు.
పిసినారి దుద్దులు( బాలల కథ)సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి--మొబైల్: 9908554535.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి