ఏకపది:(విపణి)*******
1.అన్నీ ఒక్క చోట దొరికే_పెద్ద అంగడి.
2.వ్యాపారమంతా సామూహికంగా జరిగే_అతిపెద్ద సంత.
ద్విపదం:(సరుకు)
********
1.ప్రజలకు కావలసిన అన్ని అవసరాల ముడిపదార్థం.
ఉత్పత్తయ్యి ఒక్కదగ్గర చేరే అవసరం.
2.రూపాలు వేరైనా,ధరలు వేరైనా ప్రజల అవసరాలు.
డిమాండును బట్టి అందుబాటులోకి వచ్చే అత్యవసరం.
త్రిపదం:(నాణ్యం)
*******
1.ప్రామాణికమై,శుద్ధమై,కల్తీ లేనిది.
సరైన ప్రమాణాలతో తయారుచేయబడినది.
అన్ని దశల్లో స్వచ్ఛమై మేలు చేయునది.
2.పెట్టిన డబ్బుకు సరిపడునది.
సారవంతమై,శక్తి కలిగి ఉండునది.
నాలుగు కాలాలు మన్ని,వెలుగునది.
చతుర్థపదం:(వినియోగం)
***********
1.అవసరానికి చక్కగా ఉపయోగపడుతుంది.
అవసరానికి తగినట్లు అమలులోకి వచ్చేది.
పనితనంతో మెప్పించి,ఒప్పించేది.
సందర్భానికి తగినట్లు పనిచేసేది.
2.తనను తాను పనిలోకి పెట్టుకోవడం.
ఆయా పనుల్లో ఉపయోగపడడం.
అత్యంత చక్కని ఫలితానికి ఊతం.
లాభంతో చక్కగా ఆకట్టుకోవడం.
అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి