సూరీడమ్మా సూరీడుతూరుపు దిక్కున లేస్తాడు
పడమర దిక్కున మునుగుతాడు
చలికాలంలో వెచ్చని సూరీడు
మంచుకొండ కరిగించే సూరీడు
నీటిని ఆవిరి చేసే సూరీడు
నవగ్రహాల జీవము సూరీడు
కాలము మూలము సూరీడు
ఋతువుల మూలము సూరీడు
ఆహారము ఆరోగ్యము మూలము సూరీడు
ప్రాణికోటికి ఆధారము సూరీడు !!
సూరీడు:- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి