పొట్టకోసం ...!!: ----డా.కె .ఎల్వీ .హన్మకొండ .

 వంట గదిలో కి 
చీకటి గమనించి 
మెలమెల్లగా 
చేరుకుంది ....
ఒక ..చిట్టెలుక ..!
ఎలుకను గమనిస్తూ 
చడీ చప్పుడూ -
లేకుండా ..
వెంటబడిందొక 
పిల్లికూన ....!
పిల్లి పిల్ల చేష్టలను 
చూస్తూనే ....
పిల్లి ని --
అనుసరించిందొక 
ఇంటికుక్క ....!
కుక్కజాడను 
కనిపెట్టింది ..ఆ ..
ఇంటి ఇల్లాలు 
కుక్క ను వెంబడించింది 
ఆ ..మహాతల్లి ...!
అప్పటికే ...
ఆయమ్మ 
కడుపునిండా తిని 
ఆకలితీర్చుకున్నది !
ఆకలిగొన్న మూగజీవులు 
ఆమె అలికిడితో ....
అదృశ్యమయ్యాయి !!
-------------------------------------
ఫోటోలో....:--బేబి ఆన్షి. నల్లి.