బొంగరం బాలగేయం:-సత్యవాణి కుంటముక్కుల

 బొంగరమా ఓబొంగరమా
రంగు రంగులా బొంగరమా
రాజసమొలికే బొంగరమా
భూమిని పోలిన బొంగరమా
త్రాడును చుట్టి సర్రున లాగితె
గిర్రున తిరిగెే బొంగరమా
చిన్న ములుకుపై మిన్నగ
తిరిగే బొంగరమా
పల్లెను విడచి రానిదానవు
పట్నంపోకడ తెలియని దానవు
బొంగరమా ఓ బొంగరమా
జనపదాలలో జనుల ఆటగా మిగిలేవమ్మా బొంగరమా
జయమమ్మా నీకు బొంగరమా
జానపదుల ఓ బొంగరమా