అడవిలో ఒక వింత రోగం వ్యాపించింది.
జంతువులు చనిపోతున్నాయి.
కొన్నింటికి కళ్ల జబ్బులు వచ్చాయి.
కొన్నింటికి చర్మ క్యాన్సర్ వచ్చింది.
కొన్నింటికి మానసిక జబ్బులు కలిగాయి.
మరికొన్నింటికి రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది.
ఈ వ్యాధి వలన మొక్కలు ఆహారం సంపాదించుకోలేక పోతున్నాయి.
పంటలు పండటం లేదు.
భూమి వేడెక్కిపోతుంది.
సముద్రాలలోని జలచరాలు అకస్మాత్తుగా చనిపోతున్నాయి.
పక్షులకు పారుడు రోగం వచ్చ పిల్లలు చనిపోతున్నాయి.
అడవిరాజు సింహానికి ఆందోళన కలిగింది.
ఇది ఇలాగే కొనసాగితే కొంతకాలానికి భూమి మీద జీవి ఉండడం కష్టమే అనుకుంది.
దీనికి కారణం కనుక్కోవాలి అనుకుంది.
ఆ పనికి పూనుకుని ఆంతరంగిక సలహాదారుడు గుడ్లగూబను పిలిచింది.
ఈ బాధ్యత అప్పగించి గూఢచారిగా నియమించింది.
గుడ్లగూబ తీవ్రంగా పరిశోధించి విషయం పసిగట్టింది.
మృగరాజు వద్దకు వచ్చి ఇలా అన్నది.
“రాజా! మన జబ్బులకు కారణం కనిపెట్టాను.
పర్యావరణంలో కలిగిన మార్పులే ఇందుకు కారణం.
మానవులు ప్రకృతికి శత్రువులుగా తయారు అయ్యారు.
విచ్చలవిడిగా విష వాయువులు వదులుతున్నారు.
వాహనాలు వదిలే పొగలో ఈ వాయువులు ఎక్కువగా
ఉన్నాయి.
భూమికి పైన 35 కి.మీ. దూరంలో ఓజోన్ అనే పొర ఉంది.
అది చాలా మందంగా ఉంటుంది.
ఇది రక్షణ కవచంగా పనిచేస్తుంది.
సూర్యుని నుంచి వచ్చే చెడు కిరణాలను అది ఆపుతుంది.
మంచివాటినే భూమిపైకి పంపుతుంది.
అయితే ఈ విష వాయువులు ఆ పొరను కరిగిస్తున్నాయి.
కొన్నిచోట్ల బాగా పలచబడి రంధ్రాలు కూడా పడ్డాయి.
దీనితో సూర్యునిలోని ప్రమాద కిరణాలు నేరుగా రంద్రాలలో నుంచి వస్తున్నాయి.
భూమి మీద పడుతున్నాయి.
ఆ కిరణాలు సోకిన ప్రతి ప్రాణి రోగిగా మారుతుంది” ఇదే కారణం అంది గూబ.
“దీనిని నివారించే మార్గమే లేదా?" అని అడిగింది సింహం.
“ఉంది. రాజా! భూమిపై నుంచి విషవాయువులు, రసాయనాల పొగలు పైకి వెళ్లకుండాచూడాలి.
వాటి ఉత్పత్తిని ఆపి ఆ రంధ్రాలను పూడ్చాలి.
అంతే తప్ప మందులతో ఈ మహా విపత్తును అరికట్టలేము” అని చెప్పింది గుడ్లగూబ.
సింహం ఓజోన్ పొరకు పడిన రంధ్రాన్ని పూడ్చటానికి
ఆలోచనలో పడింది.
నీతి : ప్రకృతిని కాపాడుకోకపోతే ప్రమాదాలు వస్తాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి