పిల్లలంటే పిల్లలు
మెత్తని గులాబి పువ్వులు
పిల్లలంటే నవ్వులు
పచ్చగ విరిసే పువ్వులు
పిల్లలంటే పిల్లలు
ముత్యాలవాన జల్లులు
పిల్లలంటే దివ్వెలు
రంగురంగుల రవ్వలు
పిల్లలంటే ముద్దులు
కాటుక రేఖలసుద్దులు
పిల్లలంటే రంగులు
కేరింతల హోలీ జల్లులు
పిల్లలంటే పాటలు
ఆకశపు నీలి మేఘాలు
-------------------------------------
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి