అమ్మ ఒడి చాటు పిల్లలం
నాన్న ప్రేమలో మే మల్లెలం
అమ్మ ఆడించే ఆటలు
మా బాల్యానికే బాటలు
నాన్న నేర్పించిన పాటలు
బ్రతుకు దెరువు మూటలు //అమ్మ//
అక్క చెల్లితో ఆటపాటలు
విరజల్లిన వెన్నెల వెలుగులు
తాతా గారు చేప్పే కథల్లో
ఎన్నెన్నో నీతి సూత్రాలు //అమ్మ//
గోటీలాటలు ఆడెదము
జాన మూర కొలిచెదము
చిర్రగోనె లాట ఆడెదము
దూరమెంతో తెలిపెదము //అమ్మ//
నాన్న చేయి పట్టుకుని
బడికి మేము పోయాము
గురువుకు దండం పెట్టాము
అక్షరాలు మేము దిద్దాము //అమ్మ//
బాల్యమే ఒక బంగారు దశ
అది బాధలు తెలియని దిశ
తిరిగి రాని తీపి జ్ఞాపకాల ఆ
బాల్యం ఎంతో అమూల్యం //అమ్మ//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి