'సిగం'.... :- ఎన్నవెళ్ళి రాజమౌళి - కథల తాతయ్య

 నేను తొమ్మిది సంవత్సరాలు ఉంటాను. మా నాన్న సిద్దయ్య సారుకు టీచర్ ఉద్యోగం. ఆయనతో పాటు మేముకూడ తొగుట లో ఉన్నాం. నా విద్యాభ్యాసము కూడా అక్కడే కొనసాగింది. మొహరం పండుగ వచ్చింది. పీరీలు ఎత్తుకుని డప్పు వాయిద్యాల కు పాటలకు అనుగుణంగా నాట్యం --చేస్తున్నారు.   వాళ్లను చూసేసరికి నా లో ఉత్సాహం కట్టలు తెంచుకుంది. నేను కూడా పీరీని ఎత్తుకుంటానని పెరగడంతో-నాకు ఎవరో పీరీ ఇచ్చారు. వాళ్లతో సమానంగా  లయ బద్దంగా పీరీని ఎత్తుకుని నాట్యం చేయసాగాడు....  ఈ సంగతి ఎవరో మా నాన్నకు చెప్పినట్టు ఉంది. మేము వీరశైవ జంగములము, అదీకాక నేను టీచర్ ను. వీడేంది పీరీని ఎత్తుకొని నృత్యం చేయడమేంది. అనుకున్నాడో ఏమో... వెంటనే వాయిలిబరిగతో వచ్చి నా పిక్కల పై వేశాడు. నా పిక్కలను వాయిలిబరిగ ముద్దాడే సరికి, ఎదురుగా ఉన్న వారికి పీరీ ఇచ్చి పరుగు పెట్టాను. అప్పుడు మొదలు ప్రతి ఏడు మొహరం వచ్చిందంటే చాలు.... మా వదినలు రాజమౌళికి సిగం వస్తుందని బనాయించే వాళ్లు.  ఆనాడు మొదలైంది నాలో నాట్య లక్షణం .... ఎన్నో సందర్భాలలో పాటలకు గుణంగా నృత్యాలు చేశాను.  కొసమెరుపు ఏమంటే.. ఇరు కోడు ఉన్నత పాఠశాలలో బాల వికాస యాత్ర ప్రదర్శన ఇచ్చాను. అనంతరం పిల్లలు కోలాటం ఆడుతుంటే వాళ్లతో తో పోటీపడి ఆడాలి. ఇది కాక, దుబ్బాకలో బాలసాహిత్య సదస్సు తర్వాత కూడా పిల్లలు డీజే పెట్టుకొని డ్యాన్స్ చేశారు.  పాలతో సమానంగా నేను కూడా డాన్స్ చేయగా, సార్ లు, మేడం లు వాళ్ల వాళ్ల ఫోన్లలో నా డ్యాన్స్ ను రికార్డు చేసుకున్నారు. పై రెండు సార్లు పిల్లలతో డ్యాన్స్ చేయడం ఎంతో తృప్తినిచ్చింది. ఇంతకంటే ఏం కావాలి!