'హలం పట్టిన'..:- ఎన్నవెళ్లి రాజమౌళి - కథల తాతయ్య


 భూమయ్య! నాకు ఏ ఉద్యోగము దొరకడం లేదు. నేను నీతో పాటు ఉ ఒక నాగలి దున్ను తానని అన్నాను. సరేనని అనడమే కాక, రెండు ఎద్దులను ఖరీదు చేశాడు. భూమయ్యకు మా వ్యవసాయ భూమి పాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు భూమికి సగం పాలు, రావడంతోపాటు గా.. నా నాగలి కి పాలు కూడా ఉంటుంది. పొద్దున పొలం దున్నడం, మధ్యాహ్నం చలక లో దున్నడం జరిగేది. పొలం కాడికి మా శ్రీమతి లలిత అన్నం తీసుకుని వచ్చేది. పచ్చని పొలాల లో, చెట్ల కింద భోజనం ఎంతో బాగుండేది. ఆ పొలాల మధ్య ఉంటే... అలసట మరిచేవాడిని. ఒక్కొక్కసారి మా శ్రీమతి కూడా నాతో పాటుగా తింటుండేది. ఒక నాడు పొలం దున్నుతు ఉన్నాము. నేను వెనుక నాగలి దున్నుతుంటే... ముందటి నాగలి భూమయ్య దున్ను తు ఉన్నాడు. దుంపలో బురద (తొట్టి) బాగా నిండింది. తొట్టి తీయడానికి కాలి మడిమ తో తన్నాను. కాలు అందులోనే ఇరికింది. కాలు రాకపోయేసరికి, వెల్లకిలా పడ్డాను. రెండు పగ్గాల పెట్టు దూరం ఎద్దులు గుంజు క పోయాయి. ఎలాగోలా మళ్ళీ లేచి నాగలి పట్టుక దున్నాను. ఈ విషయము సిగ్గుతో భూమయ్యకు చెప్పనేలేదు. ఇంతా జేస్తే నా వ్యవసాయంలో రెండేళ్లకు జేబులో ఒడ్లు, చంకల గడ్డి మాత్రమే మిగిలిన టు ల అయింది!