జామ పండు:- చైతన్య భారతి .పి-- హైదరాబాద్ 7013264464.
    ఉన్నది మాకొక జామ చెట్టు  
    కాసిందది  కొమ్మలు విరిగేటట్టు...
    కాయలెన్నో కసాయి  ముద్దుగోలిపేటట్టు
   మేమంతా తిన్నామండీ కడుపు నిండేటట్లు...

   చుట్టు ప్రక్కలా అందరికీ పంచామండీ 
  తిన్నవారందరు మము మెచ్చారండీ..
   నే బడిలో మిత్రులకు పంచానండీ  
  మిత్రులందరూ సంతోషించారండీ..

    ఆరోగ్య ప్రదాయిని జామ పండే కదా! 
    బలే చవకైన తియ్యని పండే కదా!
   విటమిన్లన్నీ ఉండును పండులో కదా!
   పేదవాడి ఆయుస్సును పెంచును కదా!
   
   అందుకే అందరూ నాటాలి మొక్కలను
  పెంచాలి పెరట్లో పండ్ల మొక్కలను..
   చెట్ల ఆకులు ఇచ్చును ప్రాణవాయువును
   పండ్లేమో తీర్చును మన ఆకలి మంటను....కామెంట్‌లు