ఓ తెలంగాణ కవులారా!
తెలంగాణ వాదులారా!!
తెలంగాణ మనుషులారా!!!
మన యాసల మనమే
మాట్లాడక పోతే
ఇంకొద్ది దినాలకే
మన యాస
వినబడకుంట ,
కనబడకుంట పోతది.
గిప్పటికే
నూటికి తొంబై అయిదు పైసల మందం
మాట్లాడుడే లేదు.
పరాయి, కిరాయి బాసలను
మాట్లాడుడు తప్పు కాదు గని
మన యాసల మనమే
మాట్లాడక పోవుడు,
రాయక పోవుడు తప్పు.
గిప్పటికైన
మనకు సోయి రాకపోతే
అచ్చే దినాలల్ల
మన పిల్లలు,పిల్లల పిల్లలు
మనల్ని
కాననన్న కానరు,
దేకనన్న దేకరు.
మన యాసను మనమే
మాట్లాడు కోవాలే,
మనమే రాసుకోవాలే
ఔ మల్ల!
ఔ మల్ల!: --బాలవర్ధిరాజు మల్లారం -871 2971 999
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి