అబల కాదు సబల:-వరుకోలు మాధవి-గృహిణి, కవయిత్రి-గట్లమల్యాల, సిద్ధిపేట జిల్లా-చరవాణి:9441782816.

 మహిళలంతా కలిసిరి
తాళ్లు చేతబట్టిరి
అడవిలోకి వెళ్ళిరి
కట్టెలకై వెదికిరి 
ఎండిన చెట్లు చూసిరి
గొడ్డలితో కొట్టిరి
తాళ్లనన్ని  పరిచిరి
కట్టెలన్నిపేర్చిరి
మోపు లాగ కట్టిరి
ఒకరికొకరు తోడుగ 
నెత్తి పైకి నెత్తిరి
చెమట లన్ని కారంగా 
సంత కెల్లిఅమ్మిరి
సంబురంగా ఇంటికి 
సరుకులన్ని తెచ్చిరి 
ఇంటిలోని పిల్లలు
ఎదురు చూస్తూ ఉండిరి
అన్నం కూర వండిరి
పిల్లలాకు పెట్టిరి
స్త్రీలు అన్ని రంగాల్లో
ముందుండి నడిచిరి.
అబల కాదు సబల అని
మహిళలు నిరూపించిరి.

కామెంట్‌లు