జెండాలు కట్టేటి పిల్లలం:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్, 9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.

మా బడి జెండాలు కట్టేటి పిల్లలం
మేంగుడి దండాలు పెట్టేటి మల్లెలం
చదువుల దరువు వేస్తున్న వారలం
పదవులబరువు మోస్తున్నపోరలం

ప్రక్క వీధి లో ఉంది మాకు ఓ బడి పక్కా చదువుకు నిలయం ఈ గుడి
ఇందు అక్షర లక్షలను అందిస్తారు
ముందుతక్షణ ఆంక్షల సంధిస్తారు

బడిలో కథలు గాధలు వింటాం
గుడిలో మేం కలిసి మెలిసి ఉంటాం
నిత్యం గురుదీవెనల కోరుకుంటాం
సత్యం వారి కడక చేరుకుంటాం

చదువులకు చుడతాం శ్రీ కారం
పదవులకు కడతాం ప్రాకారం
చదువుల్లో మాకు మేమే సాటి
పదవుల్లో మా కెవరు లేరు పోటి

మేం ఓనమాలు దిద్దుకొని
మా చదువు నేర్చుకుంటాం
మా ఆనవాలు అద్దుకొని
మేం పదవి కూర్చుకుంటాం

హాయి హాయిగా బ్రతుకు బండి
మేము అంతా నడుపుకుంటాం
తీయ తీయగా మామెతుకు వెండి
మేం మా కడుపు నింపుకుంటాం

చేస్తాం మా తెలుగు తల్లికి వందనం
చూస్తాంఈ వెలుగునేలలో నందనం
మా తెలుగునేల ఖ్యాతినిపెంచుతం
మావెలుగు పూల కీర్తిని పంచుతం

జాతీయ పతాకాన్నిచేతిలోన బట్టి
జాతినాయకులకు మేం సలాంగొట్టి
మా విజయ పథమందు చరిస్తాం
మేం మా విజయ లక్ష్మినే వరిస్తాం


కామెంట్‌లు