అక్షరమాలికలు:-డా.రామక‌ కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 ఏకపది:(వాస్తు)
*******
1.ఏ దిక్కులో ఏముండాలో చెప్పి...మేలు చేసే శుభశాస్త్రం!
2.బాధలకు,కష్టాలకు కారణాలు తెల్పి...సరిచేసే సహేతుకం!
ద్విపది: (వైద్యుడు)
*******
1.శరీరశాస్త్రాన్ని అవపోసన పడుతాడు.
తగిన‌ చికిత్సలు,మందులు ఇస్తాడు.
2.తెల్లకోటుపై స్టెతస్కోపుతో కనబడుతాడు.
ప్రాణాలుపోసే దైవస్వరూపం అవుతాడు.
త్రిపది:(రైతు)
*****
1.ఆరుగాలం దుక్కి దున్నే కృషీవలుడు.
ఆత్మగౌరవంతో అవనిలో సిరులు పండిస్తాడు.
దేశానికి వెన్నుముకై నిలుస్తాడు.
2.ఎండనకా,వాననకా,చలి
అనకా కష్టిస్తాడు.
అన్నపూర్ణకు ఇష్టమైన కొడుకై కనబడుతాడు.
పంటచేలనే తన దైవంగా భావిస్తాడు.


కామెంట్‌లు