పిన్ని -బాబాయ్ ..!! ---శ్యామ్ కుమార్ నిజామాబాద్.

 మా రెండో పిన్ని భయంతో కేకలు పెట్టింది. "ఒరేయ్ శ్యామ్ ముందా దెయ్యం కథలు చెప్పడం ఆపుతావా లేదా "అని  మా పెద్ద పిన్ని నా మీద  పెద్దగా అరిచింది .నేను  ఆనందంగా  పకపకా నవ్వడం మొదలు పెట్టాను వారి భయం చూసి. అది రాత్రి పది గంటల సమయం అందరు హాల్లో పడుకున్నారు.  నేను దయ్యం కథ చెప్తున్నాను. మా వయసు దాదాపు 14 సంవత్సరాలు .సెలవులలో మా నాన్నమ్మ దగ్గర నుండి మా పిన్ని  ఊరికి వచ్చేవాణ్ణి.  మా పిల్లలకి దయ్యాలంటే బాగా నమ్మకం ఉండేది అందుకని రాత్రి కాగానే నేను దెయ్యాల కథలు చెప్పే వాణ్ని చాలా విపులంగా భయపెట్టే విధంగా చెప్పేవాణ్ణి.
 మా పెద్ద  బాబాయి పేరు అప్పల చారి గారు. వేరే ఊర్లో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు .పెద్ద పిన్ని పేరు సత్యవతి. తనకు ముగ్గురు సంతానం .పల్లెటూరు రైతు కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యంలో, చాలా పనులు చేస్తూ అందరి కంటే తెలివి మరియు లౌక్యం ప్రదర్శించేది. తాను ఎక్కడ ఉంటే నేను అక్కడ  వుండి, వంటలో కూడా సహాయం చేసే వాడిని .ఎవరికీ తెలియని కుటుంబం విషయాలను కూడానాతో పంచుకునేది . ఆ  విధంగా నాకు అందరు గురించి మంచి అవగాహన కలిగింది.మంచి క్రమశిక్షణ కట్టుబాట్లు చేసేది. మా బాబాయ్ చాలా లోతైన వ్యక్తి ,కానీ ఎప్పుడూ నవ్వుతూ ,సంతోషంగా గడిపే వారు.
 ఒకసారి వీధిలోకి ,జామకాయలు అమ్మకానికి వచ్చాయి. మేము దాచుకున్న మట్టి హుండీ తీసి అది పగలగొట్టి ,అందులో నుంచి డబ్బులు తీసి జామకాయలు కొన్నారు. నేను చాలా ఆశ తో ఎప్పుడు తిందామా? అని ఎదురు  చూస్తున్నాను. వాటితో జామ్ చేద్దామని మా బాబాయి ప్లాన్ వేశారు తానే వంట ఇంట్లో కూర్చొని, వాటన్నిటి తోటి జామ్ తయారు చేశారు. తీరా చూస్తే అది  తినటానికికూడా వీలు లే నంత చండాలంగా తయారైంది.  మొత్తానికి ఆ పండ్లనుసర్వనాశనం చేసి బయట పడేశారు. నేను దాచుకున్న డబ్బులు పోయాయి ,పైగా  కనీసం జామకాయలు కూడా  తిన లేకపోయాను!
 రాత్రిపూట తినగానే మా బాబాయి కి,కాలు    నొక్కించుకు నే
  అలవాటు ఉండేది. ఒక సారి నేను పడుకుని పిలిస్తే పలక కుండా నిద్ర  పోతున్నట్టుగా ఉలుకూ- పలుకూ లేకుండా పడుకున్నాను.   " అరే పిల్లలు పడుకున్నారా!సినిమాకి  తీసుకొని వెళ్దామని అనుకున్నాం" అని అన్నారు బాబాయ్. "లేదు -లేదు" అంటూ లేచి  కూర్చున్నాము. "పడుకోలేదా ?అయితే నా కాళ్ళు నొక్కండి "అని అంటూ పట్టుకున్నారు. అప్పుడు మాకు అర్థం అయింది మేము  బుద్ధి లేకుండా ఎలా ట్రాప్ లో పడిపోయా మోనని!
 మా బాబాయ్ కి మంచి కెమెరా ఉండేది .దాంతో ఎప్పుడూ మా అందరి ఫోటోలు తీసుకునే వారు .ఆ రోజుల్లో చాలా డబ్బు ఖర్చు అయినా సరే ప్రతి చిన్న విషయానికి ఫోటో తీసేవారు.అందుకే నాకు చిన్నప్పటి ఫోటో లు చాలా ఉన్నాయి. ఫోటోగ్రఫీ  చాలా గొప్పగా చేసేవారు. తాను చేసే మేనేజర్ ఉద్యోగం చాలా ముఖ్యమైంది కనుక ,తనకు వాడుకోవడానికి రకరకాల స్కూటర్లు తెచ్చేవారు. నేను ఒకసారి చాలా సంతోషంగా ,"బాబాయ్  ఎప్పుడూ కొత్త  స్కూటర్  లు తెస్తారు" అన్నాను.
 "అవునురా, అడుక్కు తినేవాడికి 60  కూరలు" అన్నారు . ఆ వయసులో నాకు దాని అర్థం తెలియదు కానీ తర్వాత తలుచు కొన్నప్పుడల్లా నవ్వు వస్తున్టున్ది.ఆ..రోజులే వేరుమరి!
    
కామెంట్‌లు