ధర్మం - నీతి:-- యామిజాల జగదీశ్

 అనగనగా ఓ గురువు. ఆయన వద్ద శిష్యరికం చేసినవారు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళవలసిన రోజు వచ్చింది. 
అప్పుడు గురువుగారు "ధర్మాన్ని అనుసరించండి. నీతిగా బతకండి" అంటూ రెండు మాటలు చెప్పి దీవించి పంపారు.
శిష్యులకు ధర్మం, నీతి రెండూ ఒక్కటేగా అనుకున్నారు. కానీ గురువుగారు ఆ రెండూ వేర్వేరులా చెప్పడమేంటీ అని అదే ప్రశ్నను వేశారు.
అందుకు గురువుగారు "నీతి అనేది పరిస్థితులు,  చోటుని బట్టి మారుతుంది. ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం పగబట్టి ఒకరిని చంపితే అది హత్యవుతుంది. అయితే శత్రుదేశంపై తలపడి వారిని హతమారిస్తే అది వీరత్వానికి చిహ్నం. కనుక స్థలాన్నీ పరిస్థితినీ బట్టి నీతి తీరుని చెప్పుకుంటారు. కానీ ధర్మం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఒక్కటే..." అని చెప్పారు.