అంతరంగం (జీవితానుభవాలు- మిలిటరీ జీవితం):-కందర్ప మూర్తి , హైదరాబాద్.

 హైదరాబాదులోని మెడికల్ మిలిటరీ ట్రైనింగ్
 సెంటర్ కి చేరిన తర్వాత అంతా అయోమయం అనిపించింది.
 అన్నీ కొత్త ముఖాలే. కొత్త ప్రదేశం. భాష తెలియక ఎవరితో
 ఏం మాట్లడాలో , సైనిక సిబ్బంది హిందీలో అదిలింపులు
ఇలా భయం భయంగా ఉంది వాతావరణం. నేను హైస్కూలు
వరకూ హిందీ సబ్జ్యక్టుగా చదివి నందున చదవడం రాయడం
 తెలుసు కాని మాట్లాడటం రాదు.మా కంపెనీ లంగర్లో(కిచెన్)
 వంట చేసేవాళ్లు మిగతా సిబ్బంది అంతా ఉత్తరాది వారైనందున
 ఏమి కావాలన్నా చేతి సంజ్ఞలతో చెప్ప వలసి వచ్చింది. ఎవరూ
  మా బేచిలో తెలుగు వాళ్లు లేరు.సహచర మిత్రులతో వచ్చీ
రాని ఇంగ్లీషుతో దిన చర్యలు సాగేవి.
     నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి మిలిటరీ లారీలో ట్రైనింగ్
 సెంటర్లో దిగగానే కొద్ది సమయమిచ్చి గ్రూపులుగా చేసి
 చెట్ల కింద కర్రకుర్చీలలో కూర్చోబెట్ట హీరో యువకులందర్నీ
 విలన్లుగా చైన కటింగ్ తో అందరి రూపు రేఖలు మార్చేసారు
 సైనిక సిబ్బంది. అదే రూపురేఖలతో చాక్ పీసుతో పలక మీద
  సర్వీస్ నంబరు రాసి మెడలో ఉంచి నలుపు తెలుపు ఫోటో తియ్యడం జరిగింది.  తర్వాత అదే  ఫోటో మా గుర్తింపు కార్డు (పే బుక్) మీద ఉంచారు.మేము ట్రైనింగ్ పూర్తయిన తర్వాత
 కూడా అదే ఫోటోతో పే బుక్కులో నెల జీతం అందచేసేవారు.
 
     తర్వాత బేచ్ లుగా బేరక్సు లోకి తీసుకెళ్లి మా లగేజీ
 ఒక పక్క పెట్టించి లంగర్ (కిచెన్) వద్ద భోజనం ఏర్పాటు
చేసారు. సుఖా రొట్టెలు , అన్నం , కూర , సాంబారు  పెట్టారు.
 అలవాటు లేని భోజనం. ఆకలి కొద్దీ తినవల్సి వచ్చింది.
       మళ్లీ బేరక్ దగ్గరకు వచ్చి గంట విశ్రాంతి తీసుకున్నాము.
  సైనిక సిబ్బంది విజిల్ ఊది అందర్నీ బయట వరండాలో
వరుసగా నిలబట్టి సర్వీసు నంబరు (8అంకెలు) ప్రకారం పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అప్పటి నుంచి అదే నంబరు బట్టి దినచర్య
 జరుగుతుంది.
   మేము అందచేసిన మూవ్ మెంట్ ఆర్డరును బట్టి సీరియల్
గా సర్వీసు నంబరు ఎలాట్ చేసి ఇరవై మంది చొప్పున సెక్షన్,
మూడు సెక్షన్లు కలిపి ప్లాటూన్, కొన్ని ప్లాటూన్లు కలిపి కంపెనీ,
 కొన్ని కంపెనీలు కలిపి బెటాలియన్ గా ఫారం చేసి 
 ఎడ్మినిస్ట్రేషన్ నడిచేది.
         చాయ్ తాగించి దగ్గరలో ఉన్న  పెద్ద స్టోరు ప్రాంతానికి
 తీసుకు వెళ్లి  పేరు సర్వీసు నంబరు ప్రకారం వరసలో నిలబెట్టి
 ఒకొక్కరికి రెండు జతల మలేషియన్ (సిమ్మెంటు రంగువి)
 ట్రైనింగ్ డ్రెస్సులు , భగతసింగ్ ఫీల్డ్ టోపి , బేరట్ బ్లూ కేప్ , కేన్వాస్
 బెల్టు ,రెండు తెల్ల బనియన్లు , రెండు అండర వేర్ , కాకీ రంగు
 టవలు , ఆలీవ్ కలర్ ఫుల్ స్లీవ్ స్వెట్టర్, రెండు కాకీ నిక్కర్లు
   ఒక  నల్లని బ్లాంకెట్  , కాకిరంగు దోమతెర,గుడ్డ బేడ్జిలు , జత
 నల్లటి మిలిటరీ బూట్లు, రెండు జతల ఆకుపచ్చ ఉలెన్ సాక్స్ ,
 బ్రౌన్ కలర్ రబ్బరు జోళ్లు, తెల్లటి ఎనామిల్ మగ్గు , ఎనామిల్
 పెద్ద ప్లేటు, నీలం రంగు దరీ, నల్లటి పొడవైన కిట్ బేగ్ , ఉలెన్
కవరున్న వాటరుబాటిల్ , రెండు సిల్వర్ మెస్ టిన్స్ ఇలా
 చిన్న పెద్ద కలిపి ఇరవై నాలుగు వస్తువులు అందచేసి రిజిస్టర్లో
 సంతకాలు తీసుకుంటున్నారు.అవన్నీ నల్లటి కిట్ బేగ్ లో
 పెట్టుకుని  బేరక్ వచ్చినాము. 
     బేరక్ లో రెండు వరసల్లో అడుగు దూరంలో నులక మంచాలు ఉన్నాయి. మంచం పైన రెండు వరసల్లో ఇనప తీగలు దోమతెరలు కట్టుకోడానికి ఉన్నాయి. మంచానికి
 మంచానికి మధ్య మిలిటరీ సామాన్లు భద్రపరచడానికి పెద్ద
కర్ర పెట్టె ఉంది. మా పెర్సనల్ సివిల్ బట్టలు , ఎయిర్ బేగ్సు
 సూట్ కేసులు స్టోర్ రూములో జమ చేయించారు.ఆదివారం
శలవు రోజుల్లోనే సివిల్ బట్టలు వేసుకునే అవకాశం ఉంటుంది.
 కామన్ బాత్రూంలు , టాయిలెట్స్ ఉన్నందున లైను కట్టవలసి
 వచ్చేది.
       నులక మంచం మీద నీలం రంగు దరీ పరుచుకుని సివిల్
 బెడ్ షీట్ తలకింద పెట్టు కోవల్సి వచ్చేది. అవుసరమైతే బ్లాంకెట్ తలకింద వాడేవాళ్లం. సాయంకాలం ఆరవగానే  దోమ
 తెర  పైన  ఐరన్  వైర్లకు కట్టాలి. షర్టుల పూర్తి చేతులు విప్పి
 బటన్సు పెట్టాలి.దోమల నుంచి రక్షణ చాలా అవసరం.
 ఉదయం నాలుగు గంటల ముందే సెక్షన్ కమాండర్ విజిల్
వేస్తాడు. అందరూ గబగబ లేచి దోమతెర విప్పి సైజు ప్రకారం
ఫోల్డు చేసి బ్లాంకెట్ తో కలిపి మంచం తలవైపు ఉంచి ఒకవైపు
కాళీ వాటర్ బాటిల్ మూతతీసి ఉంచాలి.రెండోవైపు సిల్వర్
 మెస్ టిన్సు పెట్టాలి.మంచం మీద బ్లూ దరీ తప్ప మరే వస్తువు
 ఉండకూడదు. పైన ఐరన్ వైరుకి బెడ్ కార్డు లో రిక్రూటు సర్వీస్
నంబరు , పేరు , సెక్షన్ , ప్లాటూన్ రాసి ఉండాలి. మంచం కింద
 కాళ్ల వైపు ఒక పక్క స్పేర్ బూట్లు కింద నాడా మేకులు కనబడగా ఒకటి తిన్నగా రెండవది తిరగవేసి పెట్టాలి. మంచానికి
 ఎడమవైపు రబ్బరు షూస్ ఉంచి మంచం చుట్టూ చీపురు తో
 తుడిచి అప్పుడు నిక్కరు బనీనుతో గ్రౌండుకి చేరాలి.
       నెలకొక సారి మిలిటరీ వస్తువులు మైంటినెన్సు సరిగ్గా
చేస్తున్నదీ లేనిదీ చూడటానికి కిట్ పెరేడ్ లో అన్ని వస్తువులు మంచం మీద లేఔట్ చెయ్యాలి. ఈ పనంతా గ్రౌండ్ కి వెళ్లే
లోపు చెయ్యాలి.అన్ని వస్తువుల మీద రిక్రూట్ పెర్సనల్ సర్వీసు
నంబరు మార్కు చెయ్యాలి.
   ఇప్పటిలా అప్పుడు ప్రసార సాధనాలు లేనందున ఉత్తరాల
ద్వారానే కుటుంబ సబ్యుల క్షేమసమాచారాలు తెలిసేవి.
 కుటుంబ సబ్యులకు దూరంగా ఒక జైలు జీవితంలా ఎంతో
దిగులుగా సాగేది బేసిక్ ట్రైనింగ్.
       (తర్వాత మరికొన్ని మిలిటరీ ట్రైనింగ్ ముచ్చట్లు)
          
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం