*గొర్రెతల్లి కుక్క*(గేయకథ):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 (మొదటి భాగము)
1.
అనగనగా ఒక ఊరు
దానిపేరు ముడమాల
అందమైన ఆ వూరు
మంచికి మరి మారుపేరు !!
2.
పైరులతో పొలము మురియు
తృప్తితోడ జనము మురియు
ఎల్ల జంతు పక్షి గణము
ఊరిలోన మురియుచుంద్రు !!
3.
ఊరిలోని ఒక మూలన
చిన్న ఇల్లు ఒకటున్నది
గురవయ్యా గురవమ్మలు
అందులోన ఉండసాగె !!
4.
సంతోషము తోడ ఊరి
జనుల నోట నాలుకలా
కలిసిమెలిసి అందరితో
గడుపుచుండ్రి జీవితము !!
(ఇంకా వుంది)

కామెంట్‌లు