పుస్తకం :--శ్రీలతరమేశ్ గోస్కుల-హుజురాబాద్.
ముత్యమంటి సొగసుల
అక్షరాభరణాలు  ఒదిగిన
దేవేరి జీవితమంటే ఇష్టపడనిదెవరు...
ఒక్కో పుటలో ఒక్కో తీరుగా...  
మధురానుభూతిని పంచె బతుకును వద్దనేది ఎవరు... 

పుట్టింది మొదలు గిట్టే వరకు
క్షణమొక పుట వెనక్కి తిరగేస్తూ
సాగుతున్నదీ బతుకు పుస్తకమే...
అయినా...
పొత్తమంటి బతుకుకై  కలలు కంటూ...
ఊహాలోకంలో విహరించని మనసుండదు...

విశ్వానంతా బాలకృష్ణుడి నోట చూపినట్లు  
సమస్తాన్ని గుప్పిట దాచి చూపే నెరజానలా...
విజ్ఞాన విత్తనాలతో నిండి తరతరాల తరగని జ్ఞాన ఆయువుతో
హరివిల్లుపై ఊయలలూగే అమృత ప్రవాహినిలా...

మరణమన్నది లేని బతుకుకై
మరుజన్మకైన...
పువ్వులా సమగంధాలు వెదజల్లే పుస్తకమై...
పుట్టాలనుంది...


కామెంట్‌లు