ఎవరెంత అనుకున్నా
ఎంత బలవంతులైనా
ఏది ఎప్పుడు ఎలా జర
గాలో
అవునన్నా కాదన్నా
జరిగేది జరగక మానదు
ఎన్ని ఆవిష్కరణలు చేసినా
ఎన్ని పరీక్షలు చేసినా
అన్నింటా తామే తోపు అనుకున్నా
తన చేతిలో అన్ని ఉన్నాయన్నా
మరణాన్ని శాశించలేదే
ఆపలేదే
చిన్ని క్రిమి చేసిన క్రీడ
విశ్వాన్నే ఆడించింది
ముచ్చెమటలు పట్టించింది
ప్రపంచం అంతా అతలాకుతలం
మరచిపోగలమా
ఎన్ని ప్రాణాలు పోయాయో
విలవిలలాడాయో
అందుకే
ప్రకృతిది ఎప్పుడూ పై చేయే
మనమే ఘనులం అనుకుంటే
నవ్వుకొని సమయం వచ్చినప్పుడు
ప్రతాపం చూపుతుంది ప్రకృతి మాత
ఎప్పుడూ కరిగిపోతున్న కాలానికి బందీలమే
కాలంతో పాటే పయనం సాగిస్తూనే
మన తెలివిని చాటుతూనే ఉండాలి
నిరోధక చర్యలు
నివారణ రీతులు చేపట్టాల్సిందే
ఘనులు అనుకున్న వాళ్లే పడ్డకష్టాలు
జరిగిన సంఘనటలు
కథలు ఎన్నెన్నో
చరిత్ర నేర్పిన పాఠాలు
కావాలి గుణ పాఠాలు!!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న
తోపు ఎవరు
తలవంచాల్సిందే
ప్రకృతి బలీయం
విధి విచిత్రం
కర్మ అనుభవం!!
------------------------
డా.చీదెళ్ళ సీతాలక్ష్మి
విశ్రాంత సహాయాచార్యులు
హైదరాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి