"జమ్మి పూలు" సమ్మెట ఉమాదేవి కథానికలు.:--కూకట్ల తిరుపతి, కరీంనగర్.


  గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లోని జీవితాలను అద్దంలా మన ముందుంచిన ఆర్ద్రత నిండిన 15కథల సమాహారమే ఈ పుస్తకం. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రఖ్యాత కథారచయిత్రి సమ్మెట ఉమాదేవి గారు  వృత్తిరీత్యా ఆంగ్ల భాషోపాధ్యాయురాలిగా పనిచేస్తూ, నిత్యం గిరిజనులతో కలిసిమెలిసి ఉన్నారు. ఆ అమాయకుల కష్ట సుఖాలలో భాగమైనారు. అలా అడవి బిడ్డల మనసును గెలుసుకున్నారు. ఆ మట్టి మనుషుల దాపరికంలేని మనస్తత్వాలను, జీవితానుభవాలను ఆసక్తికరమైన కథలుగా  మలచారు. తండావాసుల వ్యవహార భాషలో సరళంగా, స్వచ్ఛంగా, సూటిగా కథానికలను అల్లిన తీరుకు రచయిత్రి సమ్మెట ఉమాదేవక్కకు హృదయ పూర్వకమైన అభినందనలు.