*మనం*:-మంజీత కుమార్--బెంగుళూరు
కలసి ఉంటే కలదు సుఖం
ఇదే కదా జీవిత పరమార్థం

దేశ భద్రత అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ కాదా సైనికులు

జాతి ఐక్యత భవితకు బాసట
ఒక్క తాటిపై ఉందాం మనమందరం

కులమతాలు - భాషలు వేరయినా
మనమంతా భరతమాత ముద్దు బిడ్డలం

స్వదేశీ వస్తువులను వినియోగిద్దాం
దేశ ద్రోహులను తరిమేద్దాం

కష్టనష్టాలను కలసి పంచుకుందాం
పండగలను సంబరంగా జరుపుకుందాం

దేశం కోసం ప్రాణాలను అర్పిద్దాం
భావి తరాలకు స్ఫూర్తిగా నిలుద్దాం

పేద ధనిక తేడాలను వదిలిపెడదాం
మానవత్వం గొప్పదని నినదిద్దాం

శాంతి స్థాపనకు కృషి చేద్దాం
భరత ఖ్యాతిని చాటి చెబుదాం


కామెంట్‌లు