చెలక లోనికి నడక (బాల గేయం):-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
పాపం పసిపిల్లల చేతులు 
పలక బలపానికి దూరం
పనులు చేయుట కొరకు
చిట్టి చేతులకు తట్ట దగ్గర

మండుటెండలో పిల్లలు
మట్టి తట్టలు ఎత్తుకొని
ఉడుత పరుగుల వలె
బుడిబుడి అడుగులేస్తూ

బుడతల ప


నులు చూడ
ఉడుత సాయం వోలె
ఉరుకుల పరుగులతో
పసిపిల్లల పనులు

కరోనా తెచ్చిన కష్టం
చదువుల బడులు లేక
తల్లి తండ్రుల వెంట
చెలక లోకి నడక పిల్లలు