సామాజిక దూరం:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుర్రాలగొంది జిల్లా సిద్దిపేటచరవాణి:8897875575


 1ఆ.వె.
దయనుజేసిచెబుత దగ్గరుండకెపుడు
చేయికలపవద్దు చెంతజేరి
జాగృతముననీవు జాగ్రత్తలేమరువ
ప్రాణములునుపోవు భవితయందు.
2ఆ.వె.
దూరముండమనకు చేరదువైరసు
మాస్కునుదరియించ మంచిగుండు
బయట కెళ్లి వచ్చి బాగుగాచేతులు 
శుభ్రపరచుకొమ్ము సుఖముకొఱకు