గురుదేవుడు విశ్వకవి రవీంద్రుడు :---పోలయ్య కవి కూకట్లపల్లి--అత్తాపూర్ హైదరాబాద్...9110784502
బెంగాలీ జ్ఞాన సూర్యుడు 
విమల చరితుడు విజ్ఞానగని 
"గురుదేవుడు"...మన విశ్వకవి రవీంద్రుడు 

అంబేద్కర్ లా 14వ సంతానంగా పుట్టినవాడు
బెంగాలి భాషలో "గీతాంజలి" అను విశిష్టమైన
కావ్యరచన చేసి ఖండాంతర ఖ్యాతి నార్జించిన
"సాహిత్య పిపాసి"... మన విశ్వకవి రవీంద్రుడు 

గానం...సంగీతం...సాహిత్యం చిత్రకళల్లో
ఆరితేరినవాడు అనుభవం పండినవాడు 
"అగ్రగణ్యుడు"...మనవిశ్వకవి రవీంద్రుడు 

జన గణ మన జాతీయగీతాన్ని 
వ్రాసిన గొప్ప నిష్కళంక దేశభక్తుడు 
"గాంధేయవాది"... మనవిశ్వకవి రవీంద్రుడు 

70 వ దశకంలో రెండువేలకు పైగా 
చిత్రాలను గీసి ప్రపంచప్రసిద్ధి చెందిన 
"గొప్పచిత్రకారుడు"...మనవిశ్వకవి రవీంద్రుడు 

ప్రకృతినే పాఠశాలగా చేసి శాంతినికేతన్ 
విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన దార్శనికుడు
"ప్రకృతి ఆరాధికుడు"...మన విశ్వకవి రవీంద్రుడు 

గ్రామాభ్యుదయమే దేశాభ్యుదయమన్న
గాంధీతాతనే మహాత్మా అని సంబోధించిన
ఆంగ్లేయులతో విభేదించి సర్ బిరుదును త్యజించిన 
"ఘనుడు త్యాగధనుడు"...మనవిశ్వకవి రవీంద్రుడు

ఇంగ్లాండ్ కెళ్ళి ఆంగ్లబాషలో ప్రావీణ్యత సాధించి
బెంగాలీలో తాను రచించిన పద్యాలను తానే
ఆంగ్లంలోకి అనువాదం చేసి "నోబెల్ బహుమతిని" 
పొందిన మొట్టమొదటి భారతీయుడు గొప్పమేధావి
"బహుముఖ ప్రజ్ఞాశాలి"...మన విశ్వకవి రవీంద్రుడు కామెంట్‌లు