కరోనా కట్టడి: :-డాక్టర్ విజయలక్ష్మి వెంకటేష్ పున్న
నీవు పరిచయమై
16 నెలలు కావస్తోంది
నీవు ఎక్కడో పుట్టి
సప్త సముద్రాలు దాటి
ప్రపంచాన్నంతా కబళించి
భయపెట్టి స్తూనే సవతితల్లిలా
చాపకింద నీరులా మా పక్కన చేరావే!!

ఏదైనా ఉపద్రవం
వస్తూనే ఉంటుంది
పోతూనే పోతుంది
అతిధి లా…….!!

నీ వెంటే తల్లి అతిథి
అంటే మర్యాదలు ……!!
పుట్టింట్లో లక్ష్మీ దేవిలా
 పుట్టాను అంటావు….!!!

నిన్ను లాలించి బుజ్జగించి
పట్టుపరికిణీలు కుట్టించి
విద్యాబుద్ధులు చెప్పించి
ఒక అయ్య చేతిలో పెట్టే
దాకా వెళ్ళినా లేవు…!!!

బయటకి వెళ్తే నీవు 
ఎక్కడున్నావో తెలియదని
ఇంట్లోనైనా సేపు గా ఉందామంటే
ఇంట్లో వాళ్ళను కూడా దడ పుట్టిస్తున్నావే!!

నిన్ను కట్టడి చేయాలంటే
వ్యాక్సిన్లు ట్యాబ్లెట్లు…!!
కాదేమో చేయాల్సింది
ఎక్కడలేని జాగ్రత్తలు
సనాతన సంప్రదాయం
వంటింల్లే వైద్యశాల యోని
పెద్దల మాట సద్ది మూటయని
దాచిన తాళపత్ర గ్రంధాలు
వేదాలు పురాణాలు ఉపనిషత్తులు
అన్ని తిరిగేశేలా చేశావే కరోనా!!

ఎందరూ మహామహులనే
 గడగడలాడిస్తున్నావే!!
మరెందరినో మట్టు పెట్టావే
ఇంకేం ఎందరినో బ్రతుకులనే
 చిందరవందర చేసావే!!

ఇంకా నీ దాహం తీరే ఎప్పుడో??
ఈ బ్రతుకులు చక్కబడే దెప్పుడో??
అది నీకే వదిలేస్తున్నాం??
మేమంతా అలసిసొలసి 
సొమ్మసిల్లి పోయాం…!!

నీకు మాత్రం అలుపు రావట్లేదే??
మమ్మల్ని కావాలని వెంటాడి వేటాడి రాక్షసిలా ఫీడిస్తున్నావే కరోనా!!
ఇక చేయాలి నీకు ముగింపు చరమగీతం పాడాలి కట్టడిచేసే పద్ధతిలో ఎన్నో??

కామెంట్‌లు