*మేడే శుభాకాంక్షలతో* *శ్రమే జయం!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
1. శ్రమ,
     సౌందర్యం,
    సౌభాగ్యం,
    సౌహార్ద్రం.
    సౌభ్రాతృత్వం!
2. శ్రమ,
    స్వేదం,
    నాదం,
    మోదం,
    ప్రమోదం!
3. శ్రమ,
    జీవిత మూలం,
    జీవన మార్గం.
    అభినవ వేదం,
     అఖిల జగతి ఆధారం!
4. శ్రమ,
     నేడు దోపిడి,
     చూడు శ్రామికుడు రాపిడి,
     ఎన్నో దోపిడి దార్లు!
     కారెవరు దోపిడిదార్లు?
5. శ్రమ,

     తిరగలి,
     కొడవలి,
     నాగలి,
    ఇంటి రంగవల్లి!
6.   భయం వీడు,
      నేలంతా కాదు బీడు,
      శ్రమ విత్తు!
      దానికుంది మహత్తు!
      విజయోస్తు!
      తథాస్తు!

కామెంట్‌లు