కాటేసే కరోనా(బాలగేయం)--పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
చేయి చేయి కలుపొద్దు
 తాకుతు అసలుండొద్దు
 చేతులు వేసి వూపొద్దు 
దగ్గర దగ్గర వుండొద్దు

 పాడు కరోనా వచ్చిందంటే 
ప్రాణాలింటే తీయునంటా
ఆక్సిజన్ నే  పెట్టాలంటే 
లక్షల గుట్టలు  కరిగే నంటా

తరచుగా చేతులు కడగండి
శానిటైజర్లను వాడండి
మంచి మాస్కులనే కట్టండి
దూరం దూరం ఉండండి.