ప్రక్రియ : సున్నితం
రూప కర్త : శ్రీమతి నెల్లుట్ల సునీత
--------------------------------------
51. కరోనా అంటురోగమే కానీ
తగు జాగ్రత్తలు పాటిస్తే
మనని ఏమి చేయగలదు ?
చూడ చక్కని తెలుగు సున్నితంబు
52. బయటికి వెళ్ళే వేళ
డబుల్ మాస్క్ ధరించు
సామాజికదూరం చక్కగ పాటించు
చూడ చక్కని తెలుగు సున్నితంబు
53. వ్యాధి నివారణ కన్న
ముందు జాగ్రత్తలు మిన్న
అనవసరముగ బయట తిరగ బోకు
చూడ చక్కని తెలుగు సున్నితంబు
54. ఆనందాల కన్న ఆయుష్షు మిన్న
ఇంటివారల క్షేమం కోరితివేని
సరదాల తిరుగుళ్ళు కట్టిబెట్టవోయి
చూడ చక్కని తెలుగు సున్నితం బు
55. కరోనా వచ్చెనని కళవళపడబోకు
క్వారంటైన్నుండి, పౌష్టికాహారం తినిన
కష్ట కాలము నిట్టే దాటగలవోయి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి