అలనాటి గాయని ఏ.పి.కోమల.:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.


 


‘ఎన్ తoగచ్చి ‘ అంటూ ఆప్యాయంగా పలుకరించే ఎంజీఆర్ జ్ఞాపకాలను మదిలో దాచుకున్న తమిళ తoగచ్చి ఆమె .పి.సుసిల అంతటి గొప్ప గాయకురాలితో ‘క్లాసికాల్ జీనియస్’ ప్రసంసలు పొందిన గాయని కోమల .ఎన్.టి.ఆర్.స్ధాపించిన ఎన్.ఏ.టి బ్యానర్లో చిత్రం ప్రారంభం అవ్వాలంటే ప్రారంభగీతం ఆమె మధురస్వరం నుంచి జాలువారాల్సిందే .సుమథుర గానoతో “కోమల “ మైన స్వరంతో శ్రోతల హృదయాలలో స్ధానం సంపాదించిన .ఎ.పి.కోమల శాస్త్రీయ సంగీతం లో విరబూసిన రాగ మందారం .నేటి తరం సంగీతాభిమానులకు ఆమె గురించి పెద్దగా తెలియక పోవచ్చు .

ఆమె పూర్తి పేరు ఆర్కాటు పార్ధసారధి కోమల .వాళ్ళ తాత ముత్తాతల ఊరు ఆర్కాడు .రాయవేలూరు ప్రక్కన ఉన్న ఊరు ఆర్కాడు .ఆమె 1935/ఆగస్టు/28 వతేదిన మద్రాసులోని తిరువలిక్కేణి (ఇప్పటి ట్రిప్లికిన్ )పార్ధసారధి లక్ష్మమ్మ ల తొమ్మిదిమంది సంతానం లో అరవ సంతానం .తండ్రి పోవడం తో తోబుటువుల బాధ్యత అంత కొమలి పైనే పడింది. తత్కరణoగ ఆమె కన్య కొమలిగానే మిగిలిపోయింది . వేల పాటలకు పడిన ,మిగుల్చుకుంది వయసు తప్ప మరేమీ లేదు .తనతో బాటు వివాహం చేసుకొని సోదరితో చెన్నై లోని మడిపాక్కాoలో ఉంటున్నారు. అలనాటి పి.లీల వంటి ప్రముఖ గాయనిలతో పాటలు పడిన కొమలను పూర్తిగా సినిమారంగం పూర్తిగా మరచింది.

ఆలిండియరేడియో లో ఉద్యోగం

రేడియో కార్యక్రమాలు నిర్వహించు యండమూరి సత్యనారాయణ చాలా సుప్రసిధ్ధులు.పాతతరం రేడియో శ్రోతలందరికీ ఆయన గురించి బాగా తెలుసు .ఆయన కార్యక్రమం ప్రారంబం కావడానికి పది నిముషాలు ముందు పాట రాసేవారు .ఆ పాటని అప్పటికప్పుడు నేర్చు కొని ఆమె పడేవారు .దాంతో ఆమె ప్రతిభని గుర్తించి 1944లో రేడియో ఆర్టిస్ట్ ఉద్యోగం ఇచ్చారు .అప్పుడామెకు 50 రూపాయల జీతం .అప్పుడు రెండో ప్రపంచ యుద్దం జరుగుతు ఉండటంతో వార్ అలెవన్సుస్ కింద మరో 14 రుపాయాలు కలిపి మొత్తం 64 రూపాయలు జీతం ఇచ్చారు .ఆమె మొదటి సంపదనే అదే . స్వతంత్రం వచ్చే వరకు ఎప్పటి ట్రిప్లికేన్ నుంచి లాగుడు రిక్షా లో ఎగ్మూరు స్టేషన్ కి వెళ్లి ,రిక్షా అతనికి నెలకి రెండు రూపాయలు ఇచ్చేవారు .అప్పటికి అందరికి తెలిసిన తాత ఉమామహేశ్వర రావు అప్పట్లో రేడియో అనౌన్సర్ గ పనిచేసారు .

త్యాగయ్యలో లో తొలి పాట ......

రేడియో లో పనిచేస్తున రోజుల్లో ప్రయాగ నరసింహశాస్త్రి సిఫారసుతో 1946 లో చిత్తురు వి.నాగయ్య తీసిన “త్యాగయ్య “ సినిమాలో తొలిసారి పాట పాడారు.జమునారాణి తో కలిసి పడిన పాట “మధురానగరిలో చల్లలమ్మ బోడు దారి విడుము కృష్ణ “ఈ పాట పడినందుకు పారితోషకం 250 రూపాయలు అలా “త్యాగయ్య “ తర్వాత “ఆత్మశాంతి “ తెలుగు లో .పి .భానుమతి పడిన “గృహప్రవేశం“(1946) సింహళ బాష డబ్బింగు సినిమాకి సింహాలంలో పాట పడారు .రేడియో లోనే కాకుండా పలు సినిమాలలో కూడా పాటలు పాడారు.ప్రముఖ సినిమా దర్శకుడు కే.వి.మహదేవన్ సినిమాల్లోకి రాకముందు గ్రామఫోనే కంపెనీ లో పనిచేసేటపుడు అయన రూపొందించిన యుగళగీతం లలితగీతం రికార్డ్స్ లో పాడారు. రేడియో సినిమాలతో పాటు వందల సంఖ్యలో కచేరీలు చేసారు.

ప్రసిద్ధ నేపధ్య గాయనుల్లో ఈమె సీనియర్

తెలుగు ,కన్నడ,తమిళ మలయాళ చిత్రాల్లో సుమారు మూడు వేలకు పైగా పాటలు పాడాను .చిన్నతనం లోనే పాటలు పడే అవకాసం రావడం తో తను పడిన పాటలో చిన్నపిల్లలకు పాడిన పాటలే ఎక్కువ .అది నా అదృష్టం .”పెళ్లి చేసి చూడు“(1952)చిత్రం లో స్కూల్ కి వెళ్ళకుండా మారం చేసే పిల్లలు “అమ్మా నోప్పులు ...” అని పాడతారు .చాల సరదాగా ఉంటుంది .అంజలీ దేవి తన సినిమాలలోని పాటలు ఈమెతోనే పాడిడేవారు. రంగులరాట్నం(1967) అంజలి దేవికి “బాలసన్యాసమ్మకథ"(1956) లో కృష్ణ కుమారికి ,”బంగారు పంజరం" లో “శ్రీ రంజనికి ,”పరమానందయ్యశిష్యులు"(1966) “కె.ఆర్.విజయకి పాటలు పాడారు . ఈమె ఎక్కువగా పడిన పాటలు సోలో పాటలే .జానికి,లీల .పి.సుసిల ,జీక్కి , మేము అంత ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం.అందరికంటే నేనే సీనియర్ ని .”రక్షరేఖ“(1949) లో ఘంటసాలతో కలిసి “ ఓహో నా రాజ కుమారుడ ....””శ్రీ లక్షమ్మ(1950) కధ””తాలగాజలునర ...”అన్న జావళి ,”అమ్మలక్కలు“(1953) జిక్కి తో కలిసి “కనేమవి తోతలోన ” ”పరాశక్తి ”సినిమాలో మా తెలుగు తల్లికి మల్లె పువ్వు దండ “జయ సింహ"(1955) లో “రావు బాలసరస్వతి తో కలిసి “మనసైన చెలి పిలిపు “ఎలా ఎన్నో పాటలు పాడను .(1960) లో దీపావళి సినిమాకి “సరి మాతో సమరాన నిలువ గలడా!"అనే పాట సావిత్రికి పాడగా బాగా పాపులర్ అయింది .అలాగే ఘంటసాల గారి సొంత చిత్రం “భక్తరఘునాద్“ (1960)లో “జయమురళి గానలోల” అంటూ పాటలు పాడారు .1974 గుంటూరు నాగార్జున అకాడమి లో ,1979 మద్రాస్ మ్యూజిక్ అకాడమి లో,కేరళ లో సద్గురు సంగీత సభ ,విజయవాడ కనకదుర్గ అమ్మ వారిసన్నిథిలో ఇలా చాల కచేరీలు చేశారు.1991 లో శ్రీవారి బ్రహ్మోస్వవాలలోకచేరి చేయడం నా పూర్వ జన్మ సుకృతం గ భావిస్తారు ఈమె.సంపాదించిన సంతోషం దూరం అయింది .స్వరానికి ,గానానికి రేటైమేంట్ అంటూ ఏమి ఉoడదు.కానీ గాయని పదవి నుండి నేను రిటైర్ కాకపోయినా వాళ్వేరిటైర్ చేసేసారు . కంఠంలో మాధుర్యం ఏమి తగ్గక పోయిన నేటి పాచ్యాత్య సంస్కృతికి అలవాటు పడిన నేటి సంగీతం లో చోటు లేకుండా పోయింది .అవార్డు లయితే వచ్చా కానీ ప్రభుత్వం నుంచి ఎటు వంటి సహాయం మాత్రం ఏమిలేదు .బ్రతికున వారు అష్ట కష్టాలు పడుతుంటే ఆదుకోకుండా పోయిన తరువాత అవార్డ్లు ,రివార్డులు ఇస్తేమాత్రం ఏంప్రయోజనం ?? అంటారు ఆమే దీర్ఘంగా నిట్టూరుస్తూ! తను నమ్ముకున్న కళనే పదుగురు బాలలకు నేర్పుతూ అజ్ఞాత జీవితం గడుపుతున్న ఇటువంటి కళాకారులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వలపైన,సాటి కళాకారులపైనా ఉంది.

( ఫోటో కోమల గారితో వ్యాసకర్త.)