మర మరాలు -బాల గేయం :---ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
మామయ్య  వచ్చాడు 
మర మరాలు తెచ్చాడు 
మహరుచి గున్నాయి 
కర కర మన్నాయి !

పల్లీలు పుట్నాలు 
కలిపి వేయించింది 
అమ్మ కరివేపాకు 
కమ్మగా కలిపింది !

బెల్లం పాకంపట్టి 
బొరుగులు కలిపేసింది 
చల్లారాక ముద్దలు 
చక్కగా తీపిబొరుగులు!

గాలికే ఎగిరిపోతాయి 
మరమరాలు తేలికైనవి 
ఆడుకొనే బాలలకివి 
ఆరోగ్యకర మైనవి!


కామెంట్‌లు