*దువ్వెనలు*:-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 దువ్వెనలమ్మా దువ్వెనలు
రకరకాల దువ్వెనలు
రంగురంగుల దువ్వెనలు
చిట్టీపొట్టీ దువ్వెనలు
పొట్టీ పొడుగూ దువ్వెనలు
సన్నపళ్ళ దువ్వెనలు
లావుపళ్ళ దువ్వెనలు
తలదువ్వే దువ్వెనలు
పేలుదువ్వే దువ్వెనలు
గడ్డందువ్వే దువ్వెనలు
మీసందువ్వే దువ్వెనలు
రోషందువ్వే దువ్వెనలు
పెద్దలు పిన్నలు అందరికీ
తలలుదువ్వీ జడలువేసీ
జగములోని జనమందరికీ
అందం తెచ్చె దువ్వెనలు
దువ్వెనలమ్మా దువ్వెనలు !!

కామెంట్‌లు