నీళ్ళు(నానీలు):-డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
1.ప్రతిబొట్టు
   ఒడిసిపట్టు
   విలువే అమూల్యం
   తెలుసుకోవాలి జనం.

2.తపన నీకై
   దాహం తీరుస్తావని!
   అన్వేషిస్తాం
   నీ జాడే మనుగడని!

3.ఎన్ని రూపాలు
   మరెన్ని‌ మార్గాలు!
   నీవుంటే చాలు
   వర్థిల్లు లోకం!

4.గలగల పారి
    సలసల కాగి
    వలవల పొంగి
    బిరబిర పోయేవు.

5.స్వచ్ఛమై
ప్రాణం‌ నిలుపుతావు!
లభ్యమై
బంగారం పండిస్తావు!

6.వేసవిలో నీవు 
    ప్రాణమే అవుతావు!
    కనబడితే చాలు 
    మనసుప్పొంగు!

7.పంటకు ఆధారం
    పండెను బంగారం!
    చెరువుకు సింగారం
    తన్నీరే కీలకం!

కామెంట్‌లు