చిదంబర జ్ఞాపకాలు: -- యామిజాల జగదీశ్
 బాలచంద్రన్ చుల్లిక్కాడు అనే మళయాల రచయిత పుస్తకాన్నొకటి తమిళంలో "చిదంబర నినైవుగళ్" (నినైవుగళ్ అంటే జ్ఞాపకాలు)  అనే పేరిట శైలజ అనువదించారు. ఇందులో 21 వ్యాసాలున్నాయి. 
ఈ వ్యాసాలలో ఒక దాని శీర్షిక రక్తం ఖరీదు!
బాలచంద్రన్ చుల్లిక్కాడు దారిద్ర్యంతో బాధపడుతున్న రోజులవి. తిరువనంత పురం నుంచి తన స్వస్థలానికి వెళ్ళేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు. అయితే ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తం ఇస్తే డబ్బు ఇస్తారన్న విషయం తెలుసుకుని అక్కడికెళ్ళి తన రక్తం ఇచ్చి  డబ్బులు తీసుకుంటాడు. ఆ డబ్బులతో ఇక ఊరుకి వెళ్ళవచ్చని ఆయన  అనుకుంటారు. ఇంతలో అక్కడికి  ఒకడొస్తాడు. అతని పేరు కృష్ణన్ కుట్టి. అతనెవరో బాలచంద్రన్ కి తెలీదు. అనారోగ్యంతో బాధపడుతున్న తన చెల్లెలికి మందులు కొనడానికి డబ్బులు లేక రక్తం అమ్ముకోవడానికి వచ్చిన వ్యక్తే కృష్ణన్ కుట్టి. అతనూ తన రక్తం ఇచ్చి డబ్బులు అందుకుంటాడు.  
కృష్ణన్ కుట్టి దగ్గర మందుల చీటీ ఇంగ్లీషులో రాసి ఉండటంవల్ల అది అర్థంకాక కృష్ణన్ కుట్టి తనతో మందుల దుకాణానికి తోడు రావలసిందిగా బాలచంద్రన్ ని కోరాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి మందులు కొనడానికి తన దగ్గరున్న డబ్బులు సరిపోవు. కృష్ణన్ కుట్టికి మరిన్ని డబ్బులు కావలసివస్తాయి. ఏం చేయాలో తెలీని అయోమయస్థితిలో ఉంటాడు. పరిస్థితి గ్రహించిన బాలచంద్రన్ రక్తం ఇచ్చుకోగా తనకు లభించిన డబ్బుల్ని కృష్ణన్ కుట్టికి ఇచ్చి మందులు కొనుక్కోమంటారు. 
చిదంబరం ఆలయ సందర్శన మొదలుకుని స్వీడిష్ అకాడమీ వరకూ సాగిన తన జీవితపయనంలోని అనుభవాల కథనమే ఈ చిదంబర జ్ఞాపకాలనే తమిళ పుస్తకం. తన జీవితంలోని వాస్తవిక సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకున్న రచయిత బాలచంద్రన్ చుల్లిక్కాడు. ఆయనకోసం అన్ని రకాల ఇబ్బందులనూ భరించిన ఆయన భార్య. ఆయన కోసం వెంటే ఉన్న మిత్రులు. ఈ పుస్తకాన్ని తెలుగులో రాయాలని కోరికైతే ఉంది కానీ అది రాసినా వేసుకునే ఆర్థిక స్థోమత లేదు. రాసుకున్న కాగితాలన్నీ నా అరలో ముక్కుతూ మూలుగుతూ ఉండాలి. ఇప్పటికే మా నాన్నగారి గురించి రాసుకున్న పుస్తకం టీపాయ్ మీద అంగుళం కదల్లేదు. ఇలాగే ఈ బాలచంద్రన్ చుల్లిక్కాడు పుస్తకంకూడా మూలపడుండాల్సిందే. అందుకే ఈ చిన్నపాటి వ్యాసంతోనైనా ఎంతో కొంత తృప్తిపడటమే మేలనిపించింది. రాసినవి వేయించుకుని డబ్బులిచ్చే వారు ఒక్కరిద్దరే. అసలు పైసలు ఇవ్వాలనే ఆలోచనే రాదెందుకో నూటికి తొంబై తొమ్మిది మందికి. కానీ డబ్బులు ఇవ్వకపోయినా రాస్తున్నారంటే తప్పంతా రాసేవారిదే.  హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసుగారు చెప్పినట్లు "అరవచాకిరీయే!" 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం