మత్తేభము:
*మదమాతంగములందలంబులు హరు | ల్మాణిక్య ముల్పల్లకుల్*
*ముదితల్ చిత్రదుకూలముల్పరిమళం | బుల్మోక్ష మీజాలు నే*
*మదిలో వీని నపేక్షచేసి నృపధా | మద్వారదేశంబుగాం*
*చి దినంబుల్ వృథపుత్తురజ్ఞులకటా | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా...
మందించిన ఏనుగులు, పల్లకీమోతలు, గుర్రపు పరుగులు, రత్నాలు, మాణిక్యాలు, స్త్రీలు, మంచి మంచి సువాసనలు ఇచ్చే పూవులు మోక్షమును ఇవరవలేవు కదా! ఏవిధముగా కూడా పనికి రాని వీటి వెనుక పరుగెత్తుతూ, రాజులను ఆశ్రయిస్తూ వారి గుమ్మం దగ్గర పడిగాపులు కాస్తారు ఇప్పుడు మనుషులు. అజ్ఞానులైన మనుషులు తమ సమయమంతా వృధా చేసుకుంటూ వుంటారు....అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నీ చేతే సృష్టించబడిన ఈ ఐహిక సుఖాలు శాస్వతము కాక పోయినా, రాజుల ప్రాపకంతో వీటిని సంపాదించు కోవాలని వారి దవ్వారంలో కాలం వెళ్ళబుచ్చుతుంటారు. అక్కడ వెచ్చించే సమయం నీ నామ స్మరణ చేస్తూ, నీ చెంతనే వుండే ప్రయత్నం చేస్తే మోక్ష మార్గంలో నిన్ను చేరి, నీ వద్ద శాస్వతంగా వుండవచ్చు కదా, కాత్యానీ పతీ! "కలౌ నామ స్మరణే ధన్యోపాయం" అన్నారు కదా! "*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి