ఎవరికోసం..!!: - సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


మనకోసం మనం బ్రతకడం లేదు 
మంది కోసం బ్రతుకుతున్నాం 
మన సమస్యలు మనకు సమస్యలే కాదు 
మంది సమస్యలు మనకు సమస్యలు 

మన సమస్యల్ని మనం పరిష్కరించుకోలేం 
మంది సమస్యల్ని మనం పరిష్కరిస్తాం 
మన కోసం మనం రిస్క్ తీసుకోం
మంది కోసం మనం రిస్క్ తీసుకుంటాం. 

మన అలంకరణ మన కోసం కాదు 
మన వేషం మన కోసం కాదు మన సౌకర్యం కోసం కాదు 
మంది కోసం మనం బ్రతుకుతున్నాం. 

మనల్ని మనం ప్రదర్శిస్తాం మంది కోసం 
వ్యాపారం కోసం కాదు అయితే పర్వాలేదు 
ఒక వ్యాపారంలా మనం వ్యవహరిస్తాం. ప్రదర్శిస్తాం. 
మన మనసును మంది చెత్తతో నింపుతాం. 

మనం ఎలా ఉన్నా ఎవరూ ఏమీ అనుకోరు 
కానీ మనం మంది కోసం మారుతాం.
మనం తిన్న తినకున్న ఎవరూ అడగరు 
మన తిండి మనం తిని మంది గురించి ఆలోచిస్తాం. 

మనం ఎలా బతికిన ఎవరికీ పట్టదు 
మంది కోసం మనం బ్రతుకుతున్నాం 
మన ఇష్టాలు మన కష్టాలు మన నష్టాలు మాని 
మంది కోసం బ్రతుకుతున్నాం.

ఎవరి నిర్ణయమో ఎవరి న్యాయ నిర్ణయమో 
ఎవరి అభిప్రాయమో మనల్ని కాపాడదు. 
మనకు మనమే న్యాయ నిర్ణయం 
మనకు మనమే నిర్మాతలం. 

మన మైండ్ మన బాడీ మన కోసమే మంది కోసం కాదు 
మన ఊహల్లో మన ప్యాంటసీల్లో మన జ్ఞాపకాల్లో నూటికి నూరు శాతం  
మందే ఉంటారు. మనం ఉండం మన వాళ్లు ఉండరు. మనం ఎవరికోసం బ్రతుకుతున్నాం 
=======================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు