మొక్క పాతుదాం:- సత్యవాణి కుంటముక్కుల-8639660566

 చిన్నమొక్క పాతుదాము చెల్లీ రావే
చెంబుతోటి నీళ్ళు పోస్త అన్నానేను
చీడ పీడ తొలగిస్తా చెల్లీ నేను
చెత్త అంత ఏరేస్తానన్నానేను
పాదు నేను చేసేస్తా చెల్లీ నేను
ఎరువు నేను వేసేస్తానన్నానేను
మొగ్గ తొడిగి పూలు పూసె  చూడే చెల్లీ
పూలు కోసి దండ కడతనన్నా నేను
దండ రాములోరికేస్త చెల్లీనేను
చేతులెత్తి దండమెడతనన్నా నేను