*రైతువేదన*:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేటచరవాణి:9391097371.


 *మత్తకోకిల*
రైతులందరు దుక్కులన్నియు
లక్షణంబుగ దున్నిరే
పాతివిత్తులు పెట్టినంతను
వర్షమప్పుడు రాకనే
యాతనొందుచు నీరుసంచులు
అందుబాటుల పెట్టగన్
మూతి విప్పిగ నీరు పాదుల
మొక్క మొక్కకు జేరగన్
కాత పట్టగ కొమ్మ లన్నియు
గాంచి కోసెను పైరునే
మోత మోసుక సంతకెళ్లియు
మొత్త మమ్మెను పంటనే

కామెంట్‌లు