అమాయకపు జంతువు..
హనుమంతుడిలా తన శక్తేమిటో ఎరుగనిది..
ప్రజాస్వామ్యంలోని పౌరునిలా తన విలువేమిటో తనకు తెలియనిది...
నిజంగా మనిషిని భయపెట్టె శక్తి తనకుందని..
తను అడ్డొస్తే ఏమానవుడు అడుగు ముందుకేయడని తెలిస్తే...
ఒకటి నీ ఇంట్లో తిష్టవేసేది..
రెండోది నువ్ కదలకుండా నీ ముందే తిరిగేది..
భయపడితే బెదిరిస్తావని..
ఎదురుతిరిగితే పరుగెడతావనే సంగతి కోతిలా పిల్లికే తెలిసుంటే...
పళ్ళన్నీ చూపించి..
ఇరవై వేళ్ళ వాడి గోళ్ళతో మనిషి భరతం పట్టేది...
*ప్రతీ యింటి ముందు పిల్లి ఉంది జాగ్రత్త అనే బోర్డులను తెప్పించేది.*..
పాలు పెరుగేం ఖర్మ...
రోజూ మాంసాహార భోజనాన్ని నీతోనే తెప్పించుకు తినేది..
తామేమిటో తెలుసుకోలేని ప్రజలు నాయకునికి జడిసినట్టు...
*ఏమీ తెలియనిఅమాయకపుఓటర్లా భయపడుతోంది*
తన బలాన్ని గుర్తించక
పారిపోతోంది..
*తనేమిటో తెలుసుకోలేని పిరికి మనిషిలా వణికిపోతోంది*....
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి