కలగంటినోయి ..!!: --------ఝన్సీ కొప్పిశెట్టి--ఆష్ట్రేలియా.
కలగంటి.. కలగంటి ..కలగంటినోయి!
నీటి నురగల్లో కవిత్వ తరగల్ని కంటినోయి!!

విశాల నీలాకాశం కింద నేనొంటరినైనట్టు..
ఉప్పెనలా నీలి సముద్రం నను ముంచెయ్యబోయినట్టు..

నీలాల నింగి సంద్రంతో కయ్యమాడి 
నను పెనవేసినట్టు..

నా చొక్కాపై నీలిపూలు చూసి చుక్కలు- వెలవెలబోయినట్టు..

నీలికళ్ళ నవ్వుల నురగలకు చంద్రుడు మసిబారినట్టు..

నా మదిలోని నీలిఛాయలన్నీ
 పటాపంచలైనట్టు..

జగమంతా సమ్మోహనంగా నవ్వుతున్నట్టు...

కలగంటి. .కలగంటి ..కలగంటినోయి,!
నీటి నురగల్లో కవిత్వ తరగల్ని కంటినోయి!

         

కామెంట్‌లు