పచ్చని చెట్టు. :-తాటి కోల పద్మావతి గుంటూరు.

 ఊరికి దూరంగా ఉన్నా ఆ కాలనీలో సుందరం దంపతులు ఒక అపార్ట్మెంట్ లో ఈ మధ్యనే అద్దెకు దిగారు ‌
వాళ్లకి ఇద్దరు పిల్లలు రోజు సాయంత్రం కాగానే ఎదురుగా కాస్తంత దూరంలో ఉన్న పెద్ద రావి చెట్టు క్రిందికి చేరి ఆడుకుంటారు.
వీళ్ళను చూసి మిగతా పిల్లలంతా వచ్చి కలుస్తారు చీకటి పడే వేళకు ఇళ్లకు వెళ్లి పోతారు.
ప్రతినిత్యం ఆ రావి చెట్టు వాళ్లకి ఒక సేదతీర్చే నేస్తం లాంటిది.
ఆదివారం వస్తే చాలు ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఆటలు ఆడుకుంటారు.
ఆ చెట్టు మీద రకరకాల పక్షులు కిలకిల రావాలతో కితకితలు ఉదయం సాయంత్రం సందడి చేస్తుంటాయి.
ఆ చెట్టు మీద నుంచి వచ్చే గాలి చల్లగా హాయిగా అనిపిస్తుంది ‌ సాయంత్రం కాసేపు అక్కడ అ కూర్చో వచ్చని 4 సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు.
పెద్దవాళ్లు కూడా వచ్చి కబుర్లు చెప్పుకుంటారు.
వేసవి కాలం రాగానే ఆకులన్నీ రాలి పోయి కొత్త చిగుళ్లు వస్తాయి.
వానాకాలం వచ్చిందంటే పిల్లలు అంతా గొడుగు కింద చేరినట్లు చేరతారు.
ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి .
గూటిలో గుడ్లను పెట్టి పొదుపు తుంటే పిల్లలంతా వాటిని ఎప్పుడు ఎప్పుడు చూద్దామని ఎదురుచూస్తుంటారు.
కాలం గడిచిపోతున్నది వేసవి సెలవులు ఇచ్చారు.
సుందరం పిల్లలిద్దరూ సెలవులకు అమ్మమ్మ గారి ఊరు వెళ్లారు.
అక్కడ వాళ్ళకి చెట్ల కేమీ కొదవ లేదు ఎటు చూసినా పచ్చని వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది ‌ ఆటల కేమి కొదవలేదు.
ప్రతిరోజు రావి చెట్టుని తలచుకునే ఉంటున్నారు.
ఆ రావి చెట్టు మీద ఉన్న గూటిలో పిల్లలు పెరిగి పెద్ద ఉంటాయి ఎగిరి పోయి ఉంటాయి.
వాటిని చూడలేక పోయినందుకు బాధపడేవారు.
సెలవులు పూర్తి అయినాయి ఊరికి తిరిగి వచ్చారు ఇంటికి రాగానే ఎదురుగా ఉండే రావిచెట్టు వైపు చూశారు ఒక్కసారిగా నిద్ర పోయారు ఆ ప్రదేశంలో బిల్డింగ్ కట్టించడానికి సిమెంటు ఇటుకలు ఇసుక కుప్పలుగా పోశారు వాటి పక్కనే అంత పెద్ద రావి చెట్టును రంపాలతో కోసి దొంగలుగా పడేశారు వాటిని చూడగానే పిల్లలిద్దరికీ కళ్ళవెంట నీళ్ళు కారాయి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ ఒకసారి ఇటు రా అంటూ తల్లిని చేయి పట్టుకుని తీసుకువచ్చారు చూసావా అక్కడ రావిచెట్టు లేదు రేపట్నుంచి మేము ఎక్కడ ఆడుకోవాలి అంటూ ఏడ్చారు.
సుందరం భార్య సరస్వతి కి కూడా కన్నీళ్లు ఆగడంలేదు ఏమైంది ఆ చెట్టుని ఎందుకు నరికేశారు అని అక్కడున్న పని వాళ్ళని అడిగింది.
ఇక్కడ అపార్ట్మెంట్ కడతారట చెట్టు అడ్డుగా ఉందని మున్సిపాలిటీ వాళ్ళ చేత చేయించారు అంటూ చావు కబురు చల్లగా చెప్పారు.
.
అపార్ట్ మెంట్ కోసం పచ్చగా ఉన్న చెట్టుని నరికేస్తారా .
ఆ చెట్టు అడ్డు వచ్చిందా పాపం ఆ పక్షులన్నీ ఎక్కడికి వెళ్ళి పోయి ఉంటాయి ఎక్కడ ఉంటాయి వాటి పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటూ చెప్పమ్మా పిల్లలు అడుగుతుంటే సమాధానం చెప్పలేక సరస్వతి మౌనం వహించింది.
ఇంటి చుట్టూ పచ్చని చెట్లు నాటాలి అంటారు ఇప్పుడు ఆ పచ్చని చెట్టునే అన్యాయంగా నరికేశారు కాలుష్యాన్ని కాపాడే ఆ చెట్టు ఏం చేసిందని ఇంతటి పాపానికి ఒడిగట్టారు.
పిల్లలు రేపట్నుంచి ఎక్కడ ఆడుకుంటారు అంటూ బాధ పడింది . గుమ్మంలో లో కూర్చుంటే చాలు చల్లటి గాలి తో ఆత్మీయంగా పలకరిస్తున్నట్లుగా ఉంటుంది రాను రాను సిమెంట్ దిమ్మలా మారిపోతున్న నగర జీవనంలో మనం కూడా సిమెంట్ దిమ్మల మారి పోతున్నాం ఎక్కడ అ ఆప్యాయత అభిమానాలు లేకుండా పచ్చదనం లేని జీవితంలో అందరి మనసులు ఎండిపోతున్నాయి బిల్డింగులు పట్టించే వాళ్లే గాని పిల్లలకి ఆటస్థలం ఉండాలని ఆలోచన రావడం లేదు.
పిల్లల కోసం చెట్లు పెంచితే చల్లటి గాలి నైనా పిలుస్తారు.
నేటి అపార్ట్మెంట్ కి ఒక పార్కు ఉండాలనే నిబంధన ఉంటే ఎంత బాగుంటుంది.
పిల్లలు సెల్ఫోన్లకు పరిమితం అవుతున్నారు కంప్యూటర్ల గేమ్స్ ల మధ్య బందీ అయిపోతున్నారు మునుపటిలా ఆటలు లేవు చెట్లు ఎక్కడం రాదు చిన్నతనంలో ఎన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం అవలీలగా చెట్లు కలిగే వాళ్ళం.
ప్రకృతి సహజ అందాల రూపు మాసి పోతుంటే ఇంకా ఎక్కడివి ఆ రోజులు.
ఈ చెట్టు చూస్తుంటే అనుబంధంతో పాటు ఆలోచనలు పరిగెడతాయి. రావి చెట్టును నరికి వేసినందుకు సుందరం కుటుంబమంతా బాధపడింది ఆ కాలనీ వాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు సాయంకాలం చల్లని నీడలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు.
పిల్లల్ని ఓదార్చింది. పక్షులన్నీ ఎటు వెళ్లి పోయా యో వాటి కిలకిలారావాలు వినలేక పోతామని బాధ పడ్డారు.
మీ చదువులు పూర్తికాగానే మన పల్లెటూరి కి వెళ్లి అక్కడ మీరు నాటిన మొక్క అప్పటికీ పెరిగే ఉంటుంది ఆ వేప చెట్టు నీడలో మళ్లీ మీ సంతోషాన్ని పొందగలుగుతారు సిటీలో ఇలాంటి చెట్లకు ఉండదు.
మన ఇంటి ముందే చిన్న మామిడి మొక్కను నాటు కొందాం లే మళ్లీ పక్షులన్నీ వచ్చి అక్కడికి చేరుతాయి అంటూ వాళ్ళకి సమాధాన పరిచింది సరస్వతి.
చెట్లు పెంచితే గాలి నీడ పండ్లు పూలు అన్నిటిని సమకూర్చి పెడుతుంది వాటిని అనుభవిస్తూనే అవన్నీ మర్చిపోయి అడ్డుగా ఉందని ఆ చెట్టు ని తొలగించుకోవటం ఎంత మూర్ఖత్వం అని మనసులోనే బాధపడింది.
పాతికేళ్ల తరువాత పల్లెటూరి లో నాటిన వేప చెట్టు కిందికి సుందరం కుటుంబం చేరారు మర్చిపోయిన జ్ఞాపకాలు మళ్లీ పొందారు.
.
కామెంట్‌లు