కిత్తూర్ రాణిచెన్నమ్మ ....అచ్యుతుని రాజ్యశ్రీ హైదరాబాదు

 ఝాన్సీ లక్ష్మీబాయి కన్నా ముందే  ఎంతోమంది వీరనారీమణులు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం కి చుక్కలు చూపారు. దత్తత స్వీకార పధ్ధతి చెల్లదు అని లార్డ్ డల్హౌసీ ఎన్నో రాజ్యాలని  వితంతురాణులను బెదిరించాడు.అలా1829లోనే వారి పై తిరుగుబాటు చేసిన కిత్తూర్ రాణి చెన్నమ్మ విగ్రహం  బెలగావిలో ఉంది ఇప్పటికీ. మైసూరు రాజ్యం లోని కాకతి అనే చిన్న పల్లెలో పుట్టింది23అక్టోబర్ న.50వ ఏట బెల్ హొంగల్ కోటలో బంధింపబడి1829లో చనిపోయినది.లింగాయత్ వనితగా ఆమె ధైర్య సాహసాలురుచి చూపిన ది.రాజు మల్లసర్జ ని పెళ్ళి చేసుకుని గుర్రపుస్వారీ కత్తి యుద్ధం  అన్నీ నేర్చుకుంది.రాజు  దేశాయ్ కుటుంబం కి చెందినవాడు. ఆమె వయసు అప్పుడు కేవలం 15ఏళ్ళు. కొడుకు పుట్టాక  భర్త  ఆతర్వాత  కొడుకు కూడా చనిపోటంతో ఆమె రాణి గా తన ప్రతి భ చూపింది.
: శివలింగప్ప అనే పిల్లవాడిని దత్తత తీసుకున్నది.అదిచెల్లదుఅని ఆంగ్లేయులు  ఆమెపై దాడి చేస్తే వారిని ఎదిరించి చేతికిచిక్కిన ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్లను  విడిచి పెట్టిన ఉదారహృదయురాలు.ఆమె సహాయకుడు  సంగోలీరాయన్న చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరు అయి రాణి ఆంగ్లేయులచేతిలో బందీ అయింది. బెల్ హొంగల్ కోటలో నేల రాలింది. సంగోలీ గొరిల్ల యుద్ధం లో పట్టుబడి ఉరితీయబడ్డాడు.శివలింగప్ప బందీయైనాడు.ప్రతి ఏడాది అక్టోబర్ 22-24మధ్య కిత్తూర్ ఉత్సవాలు జరుగుతాయి. 2007లోరాణి చెన్నమ్మవిగ్రహంని  పార్లమెంట్ ఆవరణలో ఆనాటి మన ప్రెసిడెంటు  ప్రతిభాపాటిల్ ఆవిష్కరించారు. 1977లోఆమె పేరున పోష్టల్ స్టాంపు విడుదలైంది. కిత్తూర్ రాణి చెన్నమ్మ అనే కోస్ట్ గార్డ్ షిప్  రాణిచెన్నమ్మ ఎక్స్ ప్రెస్ రైలు నడుస్తోంది. బెలగావిలో రాణి చెన్నమ్మ యూనివర్సిటీ సగర్వంగా నిలిచింది. ఇప్పటికీ ఆమె పేరున ఎంతో జానపద సాహిత్యం  ముఖ్యంగా లావణి బల్లడ మొదలైన జానపద పాటలు ఆమెవీరగాధల్ని గానంచేస్తు కన్నడిగులు కొలుస్తారు. లండన్ మ్యూజియంలో రాణి చెన్నమ్మ ఖడ్గం భద్రంగా ఉంది. ఇలాంటి  వీరనారీమణులు చరిత్ర మరుగున పడిన వారు ఎందరో!? స్కూల్ పిల్లలకి  కనీసం మోరల్ సైన్స్ సబ్జెక్టులో చారిత్రక వ్యక్తులు దేశభక్తులగూర్చి పాఠాలు ఉండాలి. అప్పుడే ఆంగ్లేయులపాలనలో వారి త్యాగం గుర్తు చేసికుంటూ నేటి మనదేశ రక్షణ  ఉన్నతికోసం పిల్లలలో భావబీజాలు నాటుకుంటాయి.అప్పుడే మనజాతి గొప్పతనం తెలుస్తుంది.
కామెంట్‌లు