అక్షరాల గంప (బాలగేయం):-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

 కంది కాయ కోసి 
గంపలో  తెచ్చిన
జామకాయలు తెంపి
చంటి గానికి ఇచ్చాను
టమాటల చట్ని చేసి 
డబ్బాలో వేసినాను 
తమ్ముడు నేను 
దండిగా తిన్నాము.
నారింజపండ్లు
పట్టుకొచ్చిన నాన్న 
బాదాము పలుకులు 
మామిడికాయలు 
యాలకులు లవంగాలు
రానీవు రోగాలు
లంగా ఓని వేసి 
వదినతో ఆడింది
శక్కరికి చీమలు
షర్టుకు దోమలు
సంచికి చిల్లలు
హంసయే తెల్లన.