ప్రక్రియ: మెరుపులు:- హాజరత్తయ్య పిల్లి

101) పర్యావరణం అంటే
మానవుల నిలయం
ప్రకృతి అంటే
జీవరాసుల ఆలయం

102) చెట్లు నరికితే
ఆక్సిజన్ తగ్గును
ఇంధనాలను వాడితే
కాలుష్యం పెరుగును

103) పర్యావరణాన్ని దెబ్బతీస్తే
మనిషిఉనికికే ప్రమాదము
ప్రకృతి నశిస్తే
సృష్టే వినాశనము

104) వాతావరణం వేడెక్కడంవలన
కరువువరదలు వచ్చును
వాతావరణకాలుష్యం వలన
జీవజాతులు అంతరించును

105) చెత్తను తిరిగివాడుకునే
విధానాలను అలవర్చుకోవాలి
చెత్తను ఉత్పత్తిచేయని
సాంకేతికతను అభివృద్ధిచేయాలి

106) చెత్తను కాల్చకుండా
చెత్తకుండీలో పడేయండి
చెత్తనురోడ్లపై విసరకుండా
చెత్తకుండీలను ఉపయోగించండి

107) వస్తువు పనికిరాకపోతే
కొనేదుకాణంలో అమ్మండి
వస్తువుని కొనాల్సివస్తే
అవసరమైతేనే కొనండి

108) మొక్కలు నాటితే
కాలుష్యాన్ని తగ్గించు
మొక్కలు పెంచితే
మనఆరోగ్యాన్ని పంచు

109) అడవులనిర్మాణం కొరకు
ప్రభుత్వంపెట్టుబడులు పెట్టాలి
అడవులపెంపకం కొరకు 
ప్రభుత్వంచర్యలు చేపట్టాలి

110) ప్రకృతినికాపాడాలంటే 
జీవనవిధానాన్ని మార్చుకోవాలి
పర్యావరణాన్ని రక్షించాలంటే
యువతను భాగస్వామ్యంచేయాలి

112) మన ప్రపంచాన్ని
విశాలదృష్టితో చూడాలి
అందమైన ప్రపంచాన్ని
అందరూకలిసి సృష్టించాలి

113) భూమి నదులను
పవిత్రంగా భావించాలి
ప్రకృతిలో దైవాన్ని
చూడటం నేర్చుకోవాలి

114) ఊరూవాడా పచ్చగాఉండాలి
పిల్లాపాపలతో 
చల్లగాఉండాలి

115)అడిగితే అన్నంపెట్టేది కన్నతల్లి
అన్నీతానై అండగాఉండేది నేలతల్లి

116) పర్యావరణ పరిరక్షణ
సర్వజన సంరక్షణ
చెట్లునాటిన చేతులు
తరతరాలకు ఆరనిజ్యోతులు

117) మన పరిసరాలను
శుభ్రంగా ఉంచుకోవాలి
పర్యావరణ కాలుష్యాన్ని
అందరూ నివారించాలి

118) ప్రాచీన సంస్కృతులు
ప్రకృతిని ఆరాధించెను
నూతన సమాజాలు
ప్రకృతిని మరిచెను

119) వాతావరణక్షేమం కోరితే
పరిసరాలు శుభ్రపడును
అందరిబాగు కోరితే
అనుబంధాలు వికసించును

120) పర్యావరణ పరిరక్షణతో
ఆధ్యాత్మికవికాసం జరగాలి
మనుషులు ప్రకృతితో
అనుబంధాన్ని పెంచుకోవాలి

121) మనిషి మనసులో 
సున్నితత్వాన్ని పెంచుకోవాలి
మనిషి ప్రకృతిలో 
మమేకం కావాలి

122) శాస్త్ర సాంకేతికతను
అభివృద్ధి చేసుకోవాలి
పర్యావరణ సమతుల్యతను
ఖచ్చితంగా పాటించాలి

123) ముళ్ళ మధ్య ఉన్నా
గులాబీ గాయపడదు
సమస్యలెన్ని ఉన్నా
మనోనిబ్బరాన్ని కోల్పోకూడదు

124) క్రూర మృగాలనైనా
నమ్మవచ్చు కానీ
నమ్మించి మోసంచేసేవారిని
నమ్మకూడదు ఏదిఏమైనా

125) కళ్ళతో చూసినది
కొంతకాలానికి మర్చిపోవచ్చు
మనసుతో చూసినది
జీవితకాలం గుర్తుండిపోవచ్చు

126) మంచిగా ఉండండి
అన్నీ అనుభవిస్తారు
అందరికోసం బతకండి
స్వర్గాన్ని చూస్తారు

127) అవసరం ఏదైనా
ఆస్తుల అమ్మ బాకు
ఎంత ఆపదవచ్చినా 
వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు

128) దేవుడు ఎక్కడోలేడు
దీనులయందే యుండు
మనిషి అనేవాడు
మానవత్వమందు ఉండు

129) కోపం మనల్ని
చిన్నవాడిగా మార్చును
సహనం మనల్ని
గొప్పవాడిగా నిలబెట్టిను

130) ఆశల సౌధాలు
ఆశయాల పునాదులు
పరోపకారములు
మానవత్వ పునాదులు

131) గెలుపు కోరుకునేవారు 
 ప్రయత్నాన్ని విడిచిపెట్టరు
ప్రయత్నాన్ని విడిచేవారు
గెలుపు సాధించలేరు

132) బలంగా నిలబడితే
గెలిచి తీరుతావు
వెనకడుగు వేసితే
గెలుపుకు దూరమవుతావు

133) ప్రతి మనిషికి
మరణం ఉంటుంది
మంచితనానికి
మార్గం ఉంటుంది

134) మంచిపనికి మించిన
 పూజ లేదు
మానవత్వానికి మించిన
సంపద లేదు

135) తగిలిన ముల్లు
నడవడం నేర్పుతుంది
తగిలిన గాయాలు
హద్దులను తెలుపుతుంది

136) అక్రమాలను ఎదిరించి
నా గొడవను సృష్టించే
అక్షరాలను రచియించి
లక్షమెదళ్ళను కదిలించే

137) ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన
ఉడుకురక్తం ఆయినది
దుర్మార్గాన్ని తునమాడిన
దుడుకుతత్వం కాళోజీది

138) అన్యాయాన్నెదిరిస్తే
నాకు సంతృప్తి
అన్యాయం అంతరిస్తే
నాకు ముక్తి ప్రాప్తి

139) ఆంగ్లేయులపై అగ్గిరవ్వలు
విసిరిన కాళోజీకొలిమి
నిజాంపై నిప్పుకణికలు
రాజేసిన కవనకొలిమి

140) నిజాం నిరంకుశత్వమును
ప్రజాకవిగా ఎదిరించెను
పేదలకు సంపాదనను
నిస్వార్ధంగా దానంచేసెను

141) తెలంగాణ సాధనోద్యమానికి
శ్రీకారం చుట్టినాడు
పౌరహక్కుల పోరాటానికి
అండగా నిలిచినాడు

142) కర్ణాటకలో పుట్టి
జనంకోసం జీవించును
కాళోజీ కలంపట్టి
చైతన్యదీప్తి రగిలించెను

143) సమాజంలోని అసమానతలను
కవిత్వంతో ప్రశ్నించెను
స్వేచ్ఛ స్వాతంత్ర్యములను
ఆకాంక్షించి పోరుసల్పెను

144) కాళోజీ జన్మదినం
తెలంగాణ భాషాదినోత్సవం
కాళోజీ జననం
తెలంగాణ మహోత్సవం

145) కాళోజీ మాటల్లో
కల్తీ లేదు
కాళోజి బాటలో
స్వార్థం లేదు

146) కాళోజీకి మాతృదేశమన్నా
అమితమైన అభిమానము
మాతృభాష యన్నా 
చచ్చేంత ప్రాణము

147)విశ్వనాథ కవిత్వమే
సంస్కృతికి చిహ్నము
విశ్వనాధ హృదయమే
నవ్య నవనీతసమానము

148)విశ్వనాధ దాతృత్వమే
అతి కర్ణము
వారి ఆదరమే
అనుభవైక వేద్యము

149)"నాది వ్యవహారభాష" యని
ప్రకటించెను విశ్వనాథుడు
ఆంగ్లభాషా వ్యామోహాని
ఎండగట్టిన కవీశ్వరుడు

150)జ్ఞానపీఠ్ అందుకున్న
తొలితెలుగు కవీశ్వరుడు
జాతిముత్యంగా వెలుగొందిన
శతగ్రంధకర్త విశ్వనాథుడు

151)సంప్రదాయాలు తగ్గుతున్న పుడు
సాహిత్యంతో మేల్కోలిపెను
విలువలు నశిస్తున్నప్పుడు
సాహిత్యమేధతో బ్రతికించెను

152)దేశవిదేశాలలో అభిమానులను 
పొందిన మూలవిరాట్
అత్యున్నత పురస్కారాలను
సంపాదించిన కవిసామ్రాట్

153)జయంతి పత్రికతో
సాహితీప్రియులను అలరించెను
కిన్నెరసాని పాటలతో
ఆంధ్రవైభవాన్ని చాటెను

154)విశ్వనాథ లేకపోతే
తెలుగే లేదు
విశ్వనాథను మరిస్తే
సాహిత్యమే లేదు

155)తెలుగుసాహితీ ప్రపంచంలో
బహుముఖీన సాహితీస్రష్ట
సామాజికస్థితులను వివరించడంలో 
సామాజిక గుణస్రష్ట

156)తెలుగు మణిహారమే 
మన సాహిత్యసురభుడు
తెలుగువారి ఆణిముత్యమే
మన విశ్వనాధుడు

157) వయసు పెరిగేకొద్దీ
ఆలోచనవిధానం మారాలి
వయసు పెరిగేకొద్దీ
అనుభవం పెరగాలి

158) మనకు విలువలేనిచోట
కోట్లు ఉన్నా వెళ్ళరాదా?
మనకు విలువఉన్నచోట
డబ్బులేకున్నా వెళ్లాలికదా!

159) భర్తఅనేవాడు
స్త్రీకి భగవంతులు
భార్య అనేవారు
పురుషులకి నమ్మకస్తులు

160) అందరితో కలిసిఉండు
ప్రేమలు పంచుకో
అందరిలాగానే నవ్వుతూఉండు
ఆరోగ్యం పెంచుకో

161) అబద్ధం చెప్పేవారు
మంచివారు అవుతున్నారు
నిజం చెప్పేవారు
ఎవరికి  పనికిరాకపోతున్నారు

162) మూలం మట్టేఅయినా
మొలకెత్తడం ప్రధానము
మనం ఎలాపుట్టిన
బ్రతకడమే ప్రమాణము

163) బురదలో తామరైనా
అందంగా బయటకువచ్చును
మట్టిలో మనిషైనా
ముత్యంలా బయటకురావచ్చును

164) ప్రేమను ఆలోచించుట
ధ్యానం కాదా?
ప్రేమను అనుభూతిచెందుట
ధ్యానమే కదా!

165) శరీరానికి వ్యాయాముంటే
ఆరోగ్యవంతంగా జీవిస్తాము
మనసుకు చదువుఉంటే
ప్రజాస్వామ్య ఫలాలు అనుభవిస్తాము

166) చదవడం వలన
విజ్ఞానం లభిస్తుంది
చదవడం ఆపేయడంవలన
అజ్ఞానం పెరుగుతుంది

167) విద్యా వ్యవస్థకు
అధికనిధులు కేటాయించాలి
విద్యా కార్యక్రమాలకు
అక్షరదీపాలు వెలిగించాలి

168) అక్షరాస్యత పెంచాలంటే
విద్యను ప్రోత్సహించాలి
సౌకర్యాలు పెరగాలంటే
ప్రభుత్వమే శ్రద్ధవహించాలి

169) అక్షర శరాలే
లక్ష్యసాధనకు సోపానాలు
భవిష్యత్ తరాలే
అక్షరాస్యతకు నిదర్శనాలు

170)అన్యాయంతో రాజీపడడం
పెద్ద నేరం
అక్రమంతో సర్దుకుపోవడం
మరీ ఘోరం

171) ప్రాచీనులు రాళ్లతో
నిప్పు పుట్టించేవారు
నవీనులు మాటలతో
ఏకంగా తగలబెడుతున్నారు

172) బ్రహ్మ జీవంపోస్తే
తల్లి జీవంఇస్తుంది
తల్లిదండ్రులు మరిస్తే
జీవితం మసకబారుతుంది

173) మౌనంగా ఉన్నంతకాలం
మంచివాళ్ళమే మనము
భరించలేక ప్రశ్నించినకాలం
చెడ్డవాళ్లమే మనము

174) ఇష్టపడే వాళ్ళకి
ప్రేమ ఉంటుంది
నటించే వాళ్లకి
నటనమాత్రమే ఉంటుంది

175) జీవితం తెలుసుకోవడానికి
సమయం ఉండదు
బాగుపడడానికి
తీరిక ఉండదు

176) ఇంటిపేరు కలిసినవాడు
కాడు బంధువు
ఆపదలో ఉన్ననాడు
ఆదుకునేవాడే బంధువు

177) కష్టం తెలియాలంటే
పనిచేసి చూడు
కష్టం అర్థమవ్వాలంటే
పనిని గౌరవించిచూడు

178) ప్రతి కష్టంవెనుక
అవకాశం ఉంటుంది
ప్రతి పనివెనుక
స్వార్థం ఉంటుంది

179) మిమ్మల్ని బలవంతులనుచేసే
ఆశయాన్ని స్వీకరించండి
మిమ్మల్ని బలహీనంచేసే
ఆలోచనలను తిరస్కరించండి

180) జీవితమంటే
వెతుక్కోవడం కాదా?
జీవితమంటే
సృష్టించుకోవడం కదా!

181) చేతితో చేసిన
సాయం మరిచిపోవచ్చు
మనసుకు చేసిన
గాయం మానక పోవచ్చు

182) డబ్బులు కోల్పోతే
తిరిగి సాధించవచ్చు
నమ్మకం కోల్పోతే
తిరిగి సాధించలేకపోవచ్చు

183) అబద్ధమాడితే
నమ్మేవారు ఎక్కువ
నిజం చెబితే
నమ్మేవారు తక్కువ 

184) నోరు జారినా
మాట తిరిగిరాదు
చేయి చేజారినా
అద్దానికి రూపులేదు

185) మాట్లాడే ముందు
ఆలోచించి మాట్లాడు
ప్రతిస్పందించే ముందు
జాగ్రత్తతో యుండు

💐మెరుపులు💐

186) ప్రతి మనిషి
నిత్య చైతన్యశీలి
ప్రతి మనిషి
నిరంతర సృజనశీలి

187) బంగారం ముక్కలుచేసిన
 విలువ తగ్గదు
ప్రేమతో సాధించిన
మంచి పోనేపోదు

188) నీతిగా బతికితే
కష్టాలు వస్తాయి
ధర్మానికి కట్టుబడితే
కన్నీళ్లే మిగులుతాయి

189) విమర్శలను వినయంతో
స్వీకరించి నడవాలి
విజయాలు నీతో
ధీమాగా వచ్చిచేరాలి

190) బాగున్నప్పుడు కలిసిఉండేది
అపవిత్రమైన బంధము
ఏమీలేనప్పుడు తోడుగాఉండేదే
నిజమైన బంధము

191)పట్టుదల ఉంటే
పేరుప్రతిష్టలు సాధించవచ్చు
కృషి ఉంటే
దేన్నైనా సాధించవచ్చు

192) సోమరితనాన్ని విడిచి
పనిచేయడం నేర్చుకోండి
పనిచేయకపోవడాన్ని విడిచి
సోమరితనం విడవండి

193) సంతృప్తిదక్కితే
కష్టపడి సంపాదించవచ్చు
సంతోషం కలిగితే
శ్రమించి సాధించవచ్చు

194) అంతరాత్మకు నచ్చితే
ఏపనినైనా చేయము
ఎవరికో నచ్చితే
చేయడానికి ఆలోచించుము

195) ఎవరోఏదో అన్నారని
వదులుకోకు ఇష్టమైనవి
మంచిచెడులు తెలుసుకొని
తీసుకో నిర్ణయాలుమంచివి

196) డబ్బున్న మనిషికి
డబ్బుఉన్నంతవరకూ విలువే
మంచిని నమ్మినమనిషికి
మరణించిన విలువే

197) ప్రేమగా పలకరిస్తే
పగవాడు మనవాడే
పరాయివారిలా భావిస్తే
మనవాడు పగ వాడే

198) అహంకారులను అసహ్యించుకును
భగవంతుడు కూడా
నిందించే వారును
ఇష్టపడడు మనిషికూడా

199) అమ్మాయికి పెళ్లిఅయితే
ఏంతెచ్చావని అడుగుతారు
ఎన్ని బంధాలను వదిలితే
వచ్చిందో పట్టించుకోరు

200) రావణరాజ్యంలో ఉండికూడా
విభీషణుడు చెడిపోలేదు
రామరాజ్యంలో ఉండికూడా
కైకేయి బాగుపడలేదు
కామెంట్‌లు