రంగేళి,వర్షాగమనం(తేటగీతిపద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

         :రంగేళి:
రంగ వల్లుల తీర్చిన రాణు లయిరి
పసిడి రంగులు వేసిరి పాడి యాడి
వేణి విన్యాస కేళితో వేడ్క దీర
ఇంటి ముందర లక్ష్ములై యింతు లలరె
          :వర్షాగమనం:
సుడులు తిరిగెను నీళ్ళలో సుధలు కురియ
ముడులు విడివడి గంగమ్మ  మురిసె దివిని
పుడమి పులకించి పోయెను పూల వోలె
కడలి సంతస మొందెను కార్తె వచ్చి

కామెంట్‌లు