సత్యభామ,ప్రేమలేఖ అందుకున్న వనిత(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

      :సత్యభామ:
నిత్య నైవేద్య ఫలముల నిచ్చు తాను
వీర పత్నిగా నిలిచిన ధీర వనిత
అంద చందము లన్నింటి యందు మేటి
సమర ప్రణయ విషయ సాక్షి గాను.

 :ప్రేమలేఖ అందుకున్న వనిత:
మధుర భావనా వీచిక మరులు గొల్ప
సఖుని‌ సల్లాప స్పర్శలు ‌సాగి‌ ఆగి
మనసు పక్షిగా ఎగిరెను మత్తు వచ్చి
ఎదలు పొంగగ జవ్వని లేఖ చదివె
కామెంట్‌లు