కలల వంతెన.....అచ్యుతుని రాజ్యశ్రీ

 మనిషికి నిద్ర లో కలలు రావటం సహజం. కానీ మనకు ఊహ వచ్చి పెరుగుతున్న కొద్దీ  ఈచదువు చదవాలి  నేను గొప్ప వాడిని కావాలి అని  అనుకోవడం  సహజం. అలాంటి ఉత్సాహం కోరిక లేకపోతే మనకి పశుపక్ష్యాదులకి ఏమీ తేడా ఉండదు. గొప్పవారు ఎలా అయినారంటే తమకలలని సాకారం  చేసుకోటంద్వారానే! ఋషులు తపస్సు చేసుకుంటూ గడిపారు. భగవంతుని చూడాలి అని. శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడటం వల్లనే మనం నేడు సుఖంగా ఉన్నాము.అబ్దుల్ కలాం చెప్పినది కూడా అదే .కలలు కనటంతోపాటు వాటిని సాకారం చేసుకునే దిశగా మనం అడుగువేయాలి.  పట్టుదల సంకల్పం దీక్ష కృషి చేసి తీరాలి.పాస్ కాదు గ్రేడ్ రావాలంటే రోజూ బడిలో చెప్పింది ఏరోజుకారోజు చదివి తీరాలి. ఇప్పుడు ఒక తండ్రి కొడుకుల పడిన శ్రమ  కష్ట నష్టాలను గూర్చి తెలుసుకుందాం. ఒక బ్రిడ్జి నిర్మాణం కై తమ జీవితాన్ని ధారపోశారు. న్యూయార్క్  మన్ హట్టన్ మధ్య  ఒకబ్రిడ్జి కట్టాలని1883లో జాన్ రొబ్లింగ్ అనే ఇంజినీరు కి ఆలోచన వచ్చింది. కానీ  ఆరోజుల్లో  వంతెన కట్టడం అంత తేలిక కాదు. "నీ పిచ్చి ఆలోచనలు మానుకో.అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు "అంతా హెచ్చరించారు. కానీ రొబ్లింగ్  తన కొడుకు  ఇచ్చిన చేయూత తో పని మొదలు పెట్టాడు.దురదృష్టవశాత్తు  రొబ్లింగ్  హఠాత్తుగా  చనిపోయాడు. వాషింగ్టన్  తండ్రి కల సాకారం చేయాలని పని కొనసాగిస్తున్న  ప్రాంతంలో ప్రమాదం జరిగి మెదడు దెబ్బతిని  మాట  నడక అన్నీ పోయి మంచంకి అతుక్కుపోయాడు.బంధుమిత్రులు అంతా "నీవు  ఫూల్ వి.ఆపని కొనసాగించవద్దని వత్తిడి చేశారు.
అంతా నకారాత్మకంగా నిరుత్సాహ పరిచారు. తండ్రి పోయిన బాధ తను మాటపడిపోయి మంచాన పడినా వాషింగ్టన్ ఆసుపత్రి కిటికీ గుండా పడే సూర్యకిరణాలను చూస్తూ గడిపేవాడు.హఠాత్తుగా అతనికి ఓఆలోచన తట్టింది. కేవలం తన చేయి ఒక వేలునికదిలిస్తూ కోడ్ భాష లోభార్య మోచేతిని తాకుతూ  సైగలు చేసేవాడు. ఆమె గ్రహించుకుని ఆబ్రిడ్జి కట్టే ఇంజినీరులను రప్పించింది. అలా13ఏళ్లు  వాషింగ్టన్  భార్య మోచేతిపై వేలితో తట్టుతూ ఆదేశాలు ఇచ్చాడు.అలా బ్రూక్లిన్ బ్రిడ్జి ఇప్పటికీ వాషింగ్టన్  పట్టుదలకు సాకారం గా నిల్చింది. మరి మనం ఈ కరోనా టైం లో జాగ్రత్తలు పాటిస్తూ మన పనులు చేసుకోవాలి. విద్యార్ధులు  నిరాశ డిప్రెషన్ కి గురి కారాదు. పుస్తకాలు  సొంతం గా చదివి పాఠాలు అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలా కలలు సాకారం చేసుకోవాలి.