*కుందేలు - తాబేలు*(కథ)("రాజశ్రీ" సాహిత్య ప్రక్రియలో)(నాలుగవభాగము):-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్

 13)
వీసమైన నీకు ప్రతిభ ఉంటేను
ఇపుడె నామీసములు కొరిగించుకుంటాను
నాతోటి వాదాడ నీకు మనసైన
వెతలపాలై పరువుపోవు ఆపైన!
14)
అట్లైన ఒక పందెమేద్దాము
ఒక్క ఉదుటున పరుగుతీద్దాము
దూరాన కనిపించు గుట్టే హద్దు
పరుగుపందెపు గెలుపు ఓటమికి పద్దు!
15)
తాబేలు తనకుతాను భారమై పోవు
కాబట్టి ఉజ్జీలు సరిసమము కావు
అనుచు పిట్టలు భేదమునెంచ
వినుచు కుందేలు గర్వమురెట్టించ!
16)
పరుగు తీసెను కుందేలు
తిరముగ నడచెను తాబేలు
కుందేలు కొంతదవ్వు ఏగెను
వెనుకకు తిరిగి చూసెను!
(ఇంకావుంది)
.