యోగ భాగ్యం,తండ్రి(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

            :యోగభాగ్యం:
యోగ్య మదియేను చూడగా యోగ మౌను
శ్వాస నుంచిన ధ్యాసకు శాంత మగును
ధన్య జీవిత మదియగు ధ్యాన మహిమ
భరత భూమిని వెలసిన భవ్య విద్య
               :తండ్రి:
తండ్రి అస్తిత్వ రూపము,తాను వెలుగు
జనక శబ్దమే పూజ్యమై జయము నిచ్చు
స్నేహ పరిమళ మందించి సేమ మరయు
తాను నిరతము  నిలుచును తాప మొంది

కామెంట్‌లు